Hyderabad: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,దాని పరిధి లోని అన్ని కళాశాలలు అందిస్తున్న 4 అండర్ గ్రాడ్యుయేట్,18 పోస్ట్ గ్రాడ్యుయేట్,13 డాక్టోరల్ ప్రోగ్రాంస్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి చెందిన నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్,న్యూ ఢిల్లీ 2021 డిశెంబర్ లో A గ్రేడ్ ఇచ్చింది.ఈ ప్రోగ్రాంస్ అన్నీ అగ్రికల్చర్,అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,కమ్యూనిటీ సైన్స్ ఫాకల్టీ ల పరిధిలో నిర్వహిస్తారు.2014 లో తర్వాత పీ జే టీ ఎస్ యూ వరంగల్,పాలెం,సిరిసిల్ల ల లో మూడు వ్యవసాయ కళాశాలల్ని,రుద్రూర్ లో ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలని స్థాపించినట్లు ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు వివరించారు.అన్ని కళాశాలల్లోనూ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెల్,అగ్రి హబ్,క్వాలిటీ కంట్రోల్ సెల్,పెస్టిసైడ్ రెసిడ్యుల్ లాబ్ వంటి ప్రత్యేక సదుపాయాలని కల్పించామన్నారు.ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీలని అంది పుచ్చుకొని పరిశోధనలని సాగించేలా ఫాకల్టీని,విద్యార్థులని ప్రోత్సహ్నిస్తున్నామని ప్రవీణ్ రావు వివరించారు.
Also Read: జయశంకర్ యూనివర్సిటీతో సహస్ర ఒప్పందం….
వ్యవసాయ విద్య పై పెరుగుతున్న మక్కువ ని ద్రుష్టి లో ఉంచుకొని గత కొన్నేళ్ళుగా వర్సిటీ లో సీట్ల సంఖ్యని పెంచుతూ వస్తున్నామని ప్రవీణ్ రావు తెలిపారు.అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు సీట్లు 2015-16 లో 564 ఉండగా 2020-21 లో 889 అయ్యాయన్నారు.వీటి లో బీఎస్సీ(అగ్రికల్చర్) 710 సీట్లు,బీ టెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) 59 సీట్లు,బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) లో 45 సీట్లు,బీ ఎస్సీ(కమ్యూనిటీ సైన్స్) లో 75 సీట్లు ఉన్నాయన్నారు.
2021-22 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల ని 988 కి పెంచుతున్నట్లు ప్రవీణ్ రావు వెల్లడించారు.దీనితో బీ ఎస్సీ(అగ్రికల్చర్) లో 760 సీట్లు,బీ టెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) 70 సీట్లు,బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) లో 61 సీట్లు,బీ ఎస్సీ(కమ్యూనిటీ సైన్స్) లో 97 సీట్ల కి ప్రవేశాలు జరగనున్నట్లు ప్రవీణ్ రావు వివరించారు.
Also Read: పిజెటీఎస్ఏ అగ్రిబయోటెక్ ఫౌండేషన్ ల మధ్య ఒప్పందం