Heavy Rains in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా అకాల వర్షాలు పడటం వలన అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలో మరో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నాయని హైదరాబాదు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే వడగళ్లతో కూడిన వర్షాలు వాయవ్య తెలంగాణలోని ఒకటి.. రెండు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి, గాలిలోని అనిశ్చితి పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కన్నా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: Spinach Health Benefits: బచ్చలి కూరతో బోలెడన్ని లాభాలు మీ సొంతం!
వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆదిలా బాద్, కుమ్రుం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో పాటుగా ఈ జిల్లాల్లో వడగండ్ల వర్షం కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలో గరిష్టంగాఉష్ణోగ్రతలు అనేవి 36 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సాగు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి వడగళ్లతో కూడిన వర్షం పడేలా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Also Read: Silver Date Palm: వేసవి కాలంలో ఈత పళ్ళను అస్సలు మిస్ కాకూడదు! ఎందుకో తెలుసా?