
అనాదిగా సాగు చేస్తున్న పసుపులో దీర్ఘకాలిక రకాలైన ఆర్మూర్ ఎరుపు దుగ్గిరాల ఎరుపు అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక రకాలు సుమారు 250 నుండి 280 రోజులు పంటకాలం కలిగి ఉంటాయి. పసుపు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల్లో రెండవ పంటగా నువ్వు సాగు చేస్తున్నారు. అలాగే పసుపులో సేంద్రియ ఎరువుల వాడకం మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువగా ఉండడం అలాగే రెండో పంట అయిన నువ్వు సాగుకు ఆ పోషకాలు తోడ్పడతాయి.
సాధారణంగా పసుపులో పశువుల ఎరువులు అధిక మోతాదులో రైతులు వేయడం జరుగుతుంది. అలాగే పసుపు పంటకాలంలో అందించే వివిధ పోషకాలు నేలలో కొంతమేర లభ్యస్థితిలో ఉంటాయి. ఈ లభ్యస్థితిలో ఉన్న పోషకాలను తర్వాతి పంట అయిన నువ్వు సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ తక్కువ ఖర్చులో మనం నువ్వు సాగుని చేపట్టవచ్చు.
సాధారణంగా నువ్వు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి ఒకటవ పక్షం వరకు విత్తుకోవడానికి అనువైనది. సాధారణంగా మురుగు నీరు నిలవని తేలికైన నేలలు అలాగే మధ్యస్థ బరువైన నేలలు నువ్వు సాగుకు చాలా అనుకూలము. పసుపు సాగు చేయడం వల్ల నేల గుల్లబారి అధిక పోషక లాభ్యతతో ఉండడం వల్ల పసుపు సాగు అనంతరం నువ్వు సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇందుకుగాను నేలని రెండుసార్లు దుక్కి దున్ని తయారు చేసుకోవాలి. ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం సాగుకు సరిపోతుంది. ఈ విత్తనాన్ని మూడింతలు ఇసుకతో కలిపి గొర్రుతో వారుసలలో విత్తుకోవచ్చు. ఇలా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా మనం వితుకునట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మంచి నాణ్యమైన పంటను మనం పొందవచ్చు.
నువ్వుల రకాలైన శ్వేత హిమ అలాగే జగిత్యాల తిల్ -1 రకాలు 80 నుంచి 90 రోజుల పంట కాలంలో మనకి సాగు చేసుకోవచ్చు ఈ విత్తనానికి విత్తనానికి ముందు కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజేబ్ తో విత్తన శుద్దిని చేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ రెండు మిల్లీ లీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలు వచ్చే రసం పిలిచే పురుగులు బారి నుండి కాపాడవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా ఎకరానికి 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అలాగే 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును వేసుకోవాలి. దీనిలో పసుపు పంట సాగు అనంతరం లభ్యమయ్యే పోషకాల్ని ద్వారా రైతు సోదరులు ఎరువుల వినియోగం తగ్గించు కోవచ్చు
నువ్వులో విత్తిన వెంటనే తడి ఇచ్చుకుంటూ పూత, కాయ సమయంలో తప్పని సరిగా ఇవ్వాలి.
నువ్వులు ప్రధానంగా ఆశించే రసం పిలిచే పురుగులైన పేనుబంక తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు పంట దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఆకు ముడత మరియు కాయ తోలచు పురుగు గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ విధంగా తక్కువ ఖర్చులో నువ్వు సాగు చేయడం ద్వారా రైతులు 4 నుండి 6 క్వింటాళ్లు ఎకరానికి నువ్వుల దిగబడి సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
Leave Your Comments