PM Kisan Seva Kendras in Telangana: వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల సేవలు ఒకేచోట ఉండేలా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి రానున్నాయని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల దుకాణాల అన్నింటినీ కిసాన్ కేంద్రాలుగా మారుస్తున్నట్లు తెలియజేసారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.80 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు. తెలంగాణ అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త తెలిపింది.
మంత్రి కిషన్ రెడ్డి శామీర్ పేటలో పీఎం కిసాన్ సేవా కేంద్రాలను ప్రారంభించారు. మిగతా కేంద్రాలను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులచే ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలను ప్రారంభించనున్నారు. దీనిద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల విత్తనాలు దొరక్క రైతులు పంటను లేటుగా వేసిన సందర్భాలున్నాయి. దీని ద్వారా దిగుబడులు లేటుగా తీసుకొని ధర లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. అందువల్ల పీఎం కిసాన్ సేవా కేంద్రాలు అందుబాటులోకి రావడం ఎంతో హర్షనీయమన్నారు.
Also Read: PM Kisan Seva Kendras in Telangana: తెలంగాణలో నాలుగు వేల ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలు.!
వ్యవసాయ పద్దతులపై అవగాహన
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలను పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా మార్చి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈకేంద్రాలు ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయాని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి అవసరమైన పనిముట్లు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు, సలహాలు, వాతావరణ సమాచారం, భూసార పరీక్షలు మొదలైనవి ఒకే చోట లభిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్దతులపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులపై, పాలేకర్ విధానాలపై కూడా అన్నదాతలకు వివరిస్తారు. అంతేకాకుండా పిచికారి చేసే డ్రోన్లు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం 2.80 లక్షల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, 1.25 లక్షల కేంద్రాలను ప్రారంభించారు. నున్నారు.
రెండో ఆదివారం రైతుల సమావేశాలు
ఈ కేంద్రాలు అనేవి రైతులకు కావలసిన క్రిమిసంహారక మందులు, పిచికారీ చేసే డ్రోన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రతి నెల రెండవ ఆదివారం సమావేశాలు నిర్వహించి రైతులకు కావలసిన సమాచారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా రైతుల సమస్యలు, సాధించిన విజయాలు గురించి కూడా సమావేశంలో చర్చిస్తారు. వ్యవసాయంపై ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తారు. ఇకపై అన్ని బ్రాండ్ల ఎరువులు ‘కూడా భారత్ బ్రాండ్’ పేరుతో రానున్నాయి. రైతులకు వాతావరణ సమాచారం, సలహలు, ధరల రేట్లు వాట్సప్ గ్రూప్ ద్వారా అందిస్తారు.
Also Read: High Yield Hybrid Chilli Varieties: మిర్చి నారు లో హైబ్రిడ్ రకాలను ఎంచుకున్న రైతులు.!