తెలంగాణ

Rythu Bandhu: ఆన్లైన్లో రైతు వారిగా పంటల సాగు విస్తీర్ణం

0
Rythu Bandhu Online Portal
Rythu Bandhu Online Portal

Rythu Bandhu: ప్రతి గుంటలో పండే పంటను కచ్చితంగా రికార్డ్ చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేసి ప్రతి రైతు పంట విస్తీర్ణం వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తుంది.

Farming

Farming

  • తెలంగాణ రాష్ట్రం సాకారం ఐనపటినుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతల్లో వ్యవసాయ శాఖ మొదటి స్థానంలో ఉంది. ఏవైనా విధానాలు రుపొందిచాలన్న ,అమలు చేయలన్నా మనకున్న వనరుల లభ్యత , వనరుల కొరత పై అవగాహనా ఉండాలి . అప్పుడే సరైన ఫలితాలు లబిస్తాయి. ఈ అవగాహనతో , దూర దృష్టితోనే రాష్ట్ర ప్రభుత్వం సాగు అవతున్న ప్రతి గుంట భూమి లెక్క పక్కగా ఉండాలి అని వ్యవసాయ శాఖకు దిశా నిర్దేశం చేసారు.
Rythu Bandhu Online Portal

Rythu Bandhu Online Portal

  • అందులో బాగంగానే వ్యవసాయ శాఖ అధికారులు ,డైరేక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారులు ప్రతి సంవత్సారo  పంట సాగు విస్తీర్ణం నమోదు చేస్తున్నారు . వానాకాలం 2019 నుంచి వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తిర్ణ అధికారులు(AEO) ప్రతి రైతు పొలం సర్వే చేస్తున్నారు,రైతు బంధు పోర్టల్ ద్వారా పంట సాగు విస్తిర్ణ వివరాలను సీజన్ వారిగా ,రైతు వారిగా ఆన్లైన్ లో పొందుపరుస్తున్నారు.

Also Read: ఖమ్మం రైతు బంధు సంబరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి.!

    పోర్టల్ యు.ఆర్.ఎల్. WWW.RYTHUBANDHU.TELANGAN.GOV.IN

  • AEO ల ద్వారా ఆయా ప్రాంతాల డేటా ఎంట్రీ పూర్తీ కాగానే నమోదు చేసిన రికార్డు ల పరిశీలనను  మండల వ్యవసాయ అధికారి,వ్యవసాయ సంచాలకులు (ఆర్) ,జిల్లా వ్యవసాయ అధికారులు చేపడతారు. అధికారుల ద్వారా యాదృచ్చికంగా సిస్టం రికార్డ్లను ఎంపిక చేస్తుంది . DAO కు 200 మంది రైతులను, ADA కు తన డివిజన్ లో 300 మంది రైతులను, MAO కు తన మండలంలో 500 మంది రైతులను తనిఖి చేయాల్సిన లక్ష్యంగా ఇస్తారు.
  • విత్తన క్షేత్రాలకు విత్తనాలు, ఎరువుల పంపిణి, మౌలిక వసతుల కల్పనా , ఉత్పత్తి అంచనా  తదితర అంశాలపై ఖచితమైన అంచనాల కోసం పంట భూముల నమోదుకు సంబంధిచిన ప్రముఖ్యత ఏంతొ ఉంది.
  • పంట సాగు విస్తీర్ణం ఆన్లైన్ లో నమోదు చేసిన తర్వాత ప్రతి రైతు కు ఒక SMS కూడా పంపుతారు , ఏమైనా సవరణలు చేయాల్సిన అవసరాన్ని రైతులు గమనించి నట్లయితే , సంబదిత AEO కు సమాచారం తెలియ జేయాలి .

Also Read: రైతుబంధు జాప్యం.. కారణమిదే.!

Leave Your Comments

Mirchi Price: మిర్చి ఒక క్వింటాల్ రూ.16350- ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ ఖమ్మంలో

Previous article

Castor Farming Techniques: ఆముదం సాగు యాజమాన్య పద్దతులు

Next article

You may also like