Entomology -2022: ‘ఎంటమాలజీ-2022, ఇన్నో్వేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్’ అనే అంశం పై మూడు రోజుల జాతీయ సింపోజియం రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో ఈరోజు ప్రారంభం అయింది. ఎంట మాలజీ, హైదరాబాద్ చాప్టర్, పీ జే టీ ఎస్ ఏ యూ, ఎంట మాలజి కల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్, అగ్రి బయో టెక్ ఫౌండేషన్, హైదరాబాద్ లు సంయుక్తం గా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇండియన్ ఎక లాజికల్ సొసైటీ, లుధియానా అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావన్ ముఖ్య అతిధి గా కీలకోపన్యాసం ఇచ్చారు. ఎంట మాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ అధ్యక్షులు డాక్టర్ ఎస్. ఎన్ పూరి సింపోజియం కి అధ్యక్షత వహించారు. ఎన్ ఐ పీ హెచ్ ఎం డై రక్టర్ జనరల్ డాక్టర్ హనుమాన్ సింగ్, పీ జే టీ ఎస్ ఏ యూ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ, ప్లాంట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శరత్ బాబు లు ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు.
పంటలు, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ధావన్ సూచించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించటం కోసం అన్ని విభాగాల శాస్త్రవేత్తలు సమన్వయం తో పని చేయాలని అభిప్రాయపడ్డారు.అధునాతన టెక్నాలజీ ల సాయం తో సమగ్ర సస్యరక్షణ కి చర్యలు తీసుకోవాలని ధావన్ అన్నారు. పూరి తన ఉపన్యాసం లో సమగ్ర సస్యరక్షణ విధానాల పై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. నూతన విద్యా విధానం లో భాగం గా నైపుణ్యాభివృద్ది కి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త సవాళ్లు ఎదురైనపుడు ఇన్నో్వేషన్స్ అవసరం అవుతాయని సీమ అన్నారు. అయితే ఈ ఇన్నో్వేషన్స్ ఆమోదయోగ్యం గా అందరికి అందుబాటులో ఉండే విధంగా వుండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో సింపోజియం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టీ వీ కే సింగ్, కన్వీనర్, వర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ జే ఎస్ బెంటూర్, వివిధ రాష్ట్రాలకి చెందిన సుమారు వందమంది శాస్త్రవేత్తలు ఈ సింపోజియం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొన్ని ప్రచురణ లని విడుదల చేశారు.
Also Read: Coconut Milk For Hair: కొబ్బరి పాలతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం!
మరో వైపు రాజేంద్రనగర్ లోని సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్ లో అధిక సాంద్రత పద్ధతి లో యాంత్రికరణ ద్వారా పత్తి తీత పై అవగాహన కార్యక్రమం జరిగింది. దీనిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ, పీ జే టీ ఎస్ ఏ యూ, రాశి సీడ్స్ సంయుక్త గా నిర్వహించాయి. వ్యవసాయ స్పెషల్ కమిషనర్ హనుమంతు, వర్సిటీ పూర్వ ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ఎస్ ఆర్ టీ సీ బాధ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు,కృషి విజ్ఞాన కేంద్రాలు, డా ట్ సెంటర్ల బాధ్యులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు దీనిలో పాల్గొన్నారు.
యంత్రం ద్వారా పత్తి తీత ప్రయోగాన్ని తిలకించారు.రానున్న రోజుల్లో ఇటువంటి సాగు పద్ధతులను మరింత ప్రోత్సాహించాలని హనుమంతు అన్నారు. ఇప్పుడు ఎదురైన సవాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకొని వచ్చే సీజన్ కి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ టెక్నాలజీ తెలంగాణా కి బాగా అనుకూలమయిందని ప్రవీణ్ రావు అన్నారు. ఇటువంటి పద్ధతుల అమలు కు వర్సిటీ, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు పరస్పరం కలిసి పని చేయాలని సూచించారు. ఈ సందర్బంగా వర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ డ్రోన్ కెమెరా ని, మరో పాలిహోస్ ని అతిధులు ప్రారంభించారు.
Also Read: Cotton Marketing: పత్తికి మంచి ధర దక్కాలంటే రైతులు వీటిని పాటించాలి.!
Also Watch:
Must Watch: