PJTSAU: అమెరికా వ్యవసాయ విభాగంకు చెందిన వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ద్రువ్ సూద్ సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ను సందర్శించారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలోని కమిటీ హాల్-1లో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ, పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘు రామిరెడ్డి తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో అమెరికా వ్యవసాయ విభాగం కార్యకలాపాలను ఆయన వివరించారు.
Also Read: 80 Percent Subsidy on Seeds: 80 శాతం సబ్సిడీపై విత్తనాలు.!
అవగాహన ఒప్పందం
పంటల ధరలు, డిమాండ్ పై సూచనల ఇవ్వడంలో అనుసరిస్తున్న మెథడాలజీ, విధానాలను ఆయన వివరించారు. అలాగే పత్తి పంట విస్తీర్ణం, దిగుబడిపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి పంట పరిస్థితి, దిగుబడి వంటి అంశాలు ఈసందర్భంగా చర్చకు తీసుకవచ్చారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ USDA, వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కోసం కృషి చేయాలని కోరారు.
అలాగే ఫ్యాకల్టీ, శాస్త్రవేత్తలకు సామర్ధ్యాల పెంపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పరస్పరం చేపట్టేందుకు సహకారం అందించాలన్నారు. వ్యవసాయ రంగంపై పూర్తిగా చర్చించారు. ఆకాల వర్షాలకు రైతులు అనుసరించాలిసిన విధి విధానాలు, అరుతడి పంటలు వాటి గురించి ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనే దానిపై సమగ్రంగా చర్చించారు. ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ తరగతులు గురించి వివరించారు.
Also Read: Integrated Farming: సమగ్ర వ్యవసాయం చేయడం వలన రైతులకు ఎలాంటి లాభాలు వస్తాయి.!