Cultural Competitions in PJTSAU: ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అంతర్ కళాశాల క్రీడలు, లలిత కళలు మరియు సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిసాయి. ఈ ముగింపు సభను, యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథులుగా రాజేంద్రనగర్ డి.సి.పి, ఆర్. జగదీశ్వర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భం పురస్కరించుకొని ఆర్. జగదీశ్వర్, విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగం భారతదేశానికి వెన్నెముక వంటిదన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరచగలరని ఆశాభావం ను వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ అన్ని కళాశాలలో క్రీడలకు సంబంధించిన వసతులు మెరుగుపరుస్తూ, బాలికలకు ప్రత్యేకమైన జిమ్ వసతిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

Winners in Cultural Competation
ఈ పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన 570 మంది విద్యార్థి, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా హోరాహోరీగా సాగిన బాలుర క్రికెట్ క్రీడ చివరి ఆటలో రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు గెలుపొందగా, జగిత్యాల కళాశాల విద్యార్థులు రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
లలిత కళలు, సాంస్కృతిక, సాహిత్య మరియు సృజనాత్మక పోటీలలో కమ్యూనిటీ సైన్స్ కళాశాల, సైఫాబాద్ విద్యార్థిని విద్యార్థులు మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బాలికల విభాగంలో ఛాంపియన్ షిప్ ను వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట దక్కించుకోగా, బాలుర విభాగంలో వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
కైవసం చేసుకుంది. మొత్తంగా రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థి, విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ కైవసం చేసుకున్నారు.

Cultural Competitions in PJTSAU
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ వి. అనిత, డాక్టర్ జె. సత్యనారాయణ, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ జమునా రాణి, కళాశాల అసోసియేట్ డీన్ సి. నరేంద్ర రెడ్డి, యూనివర్సిటీ అబ్జార్వర్ డాక్టర్ బి. విద్యాసాగర్, మరియు డాక్టర్ వి. రవీందర్ నాయక్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బోధన బోధనేతర సిబ్బంది వివిధ కళాశాలల OISAలు, PD లు పాల్గొని కార్యక్రమాలన్నింటిని పర్యవేక్షించారు. ఈ ఐదు రోజుల క్రీడాంశాలు విద్యార్థిని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Watch: