PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. అగ్రో కెం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో నాణ్యమైన దిగుబడి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్ర అన్న అంశం పై రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో ఈ రోజు సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భం గా పీ జే టీ ఎస్ ఎస్ ఏ యూ-విస్తరణ విద్యా సంస్థ రూపొందించిన సంచార ప్రచార వాహనాలని,మొబైల్ అగ్రి సపోర్ట్ సర్వీసెస్(మాస్) ని మంత్రి ప్రారంభించారు.
ఒకప్పడు జీవనాధారం కోసం వ్యవసాయం చేసేవారని,నేడు మార్కెట్ ఆధారితం గా మారిందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు పి.రఘురామిరెడ్డి అభిప్రాయ పడ్డారు.సాగు విస్తీర్ణం,దిగుబడులు బాగా పెరిగాయని అదే సమయం లో రైతాంగానికి కొత్త సవాళ్ళు ఎదురు అవుతున్నాయని వివరించారు.రైతులు సంఘటితం గా వీటిని ఎదుర్కోవాలని అన్నారు. ఎరువులు,పురుగు మందులు వంటివి అవసరం అయినంత మేరకే వాడాలని,ఈ విషయం లో వ్యవసాయ శాఖ,విశ్వవిద్యాలయం అందించే సూచనలు,సలహాలని రైతాంగం పాటించాలని రఘురామి రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Minister Niranjan Reddy: రైతులను ఎవరూ మోసం చేయవద్దు – మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణా వ్యవసాయ రంగం లో జాతీయ స్థాయి లో రికార్డులు సాధిస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు అభిప్రాయ పడ్డారు.ప్రభుత్వం కూడా టెస్టింగ్ లాబ్ లని బలోపేతం చేస్తొందన్నారు.రైతులు కూడ అవగాహన పెంచుకొని నాణ్యమైన,ధ్రవీకరించిన ఇన్ పుట్స్ నే తీసుకోవాలని హనుమంతు సూచించారు.
సదస్సులో పాల్గొన్న రైతులు,డీలర్లు,వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు,వ్వవసాయ పరిశ్రమ ప్రతినిధులని ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.వ్యవసాయం లో నకిలీలని అరికట్టేందుకు దేశవ్యాప్తం గా ఒక సమగ్ర చట్టం రావల్సిఉందన్నారు.పెస్టిసైడ్స్,బయో పెస్టిసైడ్స్ నాణ్యాత ప్రమాణాలు గుర్తించటానికి రాష్ట్రం లో ఓ వ్యవస్థ ని తీసుకురావటానికి క్రుషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఎరువులు,పురుగుమందులు,విత్తనాల నాణ్యత తదితర విషయాల్లో రైతాంగం లో అవగాహన పెంపొందించడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ కార్యదర్శి,వర్సిటీ ఇంచార్జి ఉపకులపతి ఎం.రఘునందన్ రావు,ఐ ఏ ఎస్,అగ్రో కెం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఆర్ జీ అగర్వాల్,ఎన్ ఐ ఆర్ డీ మాజీ డైరక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి,ఎన్ ఐ పీ హెచ్ ఎం డైరక్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్,విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొనారు.
Also Read: Intercropping: రెండు సంవత్సరాలో నాలుగు అంతర పంటలని పండించడం ఎలా…?