Koonaram Agriculture College: నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారు. వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న పెద్దపల్లి యువత కోసం కూనారం రీసెర్చ్ సెంటర్లో డిప్లమా ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, పౌల్ట్రీ, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కోర్సులతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు.
కళాశాల ఏర్పాటుతో యువతకు లబ్ధి చేకూతుందని వివరించారు. స్పందించిన సీఎం వెంటనే కూనారంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డిని కలిసి వివరించగా కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ఏర్పాటు అయితే ఈ ప్రాంత యువతకు లబ్ధి చేకూరనుంది.
కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్యే నియోజకవర్గ యువత పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
Indoor Plants: మీ ఇంటిలో ఈ మొక్కలని పెంచండి… స్వచ్ఛమైన గాలిని పీల్చండి.!
Yellow Watermelon: పసుపు వాటర్ మెలోన్ని మీరు చూశారా..?
Drone Pilot Training: వ్యవసాయానికి ప్రత్యేకమైన డ్రోన్స్ తయారీ.!
Chekurmanis: పోషకాల నిలయమైన కొత్త పంట చెకుర్మనిస్ సాగు వివరాలు.!