Minister Niranjan Reddy: హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు నూతనంగా విధులు స్వీకరించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీ గెరత్ విన్ ఓవెన్ మర్యాద పూర్వకంగా కలిసారు.
ఆయనతో పాటు బ్రిటీష్ డిప్యూటీ కమీషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం అధికారి ప్రణీత్ వర్మ, వారితో పాటు సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
Also Read: TS Agri Minister Niranjan Reddy: సాగు అనుకూల భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్ ది రెండవస్థానం – మంత్రి
Minister Niranjan Reddyతెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వర్ధిళ్లుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం మారింది. రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతానికి ఖర్చు చేశాం. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి సదుపాయంతో రైతులు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతున్నారు.
గత ఎనిమిదేళ్లలో నూతనంగా 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. దేశంలో అత్యధిక పంటలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయాలు తెలుసుకుని బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, ఎగుమతులు, దిగుమతులపై చర్చ మంత్రి చర్చ జరిపారు.
Also Read: Minister Niranjan Reddy: చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!