International Year Of Millets 2023: భారత ప్రభుత్వం తృణ ధాన్యాల పోషక విలువలు మరియు ప్రాముఖ్యతను గుర్తించిన కారణంగా 2023 సంవత్సరాన్ని “అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా” గుర్తించడం జరిగింది. అంతేకాక ఇదే విధానాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి తెలియజేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం తృణధాన్యాల సేద్యాన్ని ప్రోత్సహించి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ ఆహారంలో తృణ ధాన్యాలను ఒక ప్రాముఖ్యమైన ఆహారంగా చేర్చడం దీని ఉద్దేశంగా నిర్ణయించడం జరిగింది.
మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో సాంప్రదాయంగా తృణ ధాన్యాలను పండించే రాష్ట్రంగా గుర్తించబడింది. రాష్ట్రంలో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ తృణధాన్యాలను సాగు చేయడంలో ముందున్నాయి.
Also Read: Fall Armyworm – Paddy Blast: మొక్కజొన్నలో కత్తెర పురుగు – వరిలో అగ్గి తెగులు గుర్తు పట్టండిలా.!
ఈ అంతర్జాతీయ తృణధాన్యాల సాగు సంవత్సరం 2023 గుర్తింపు లభించిన నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రదర్శన క్షేత్రాలు, అవగాహన కార్యక్రమాలు, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించే అంకురాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 3న కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీని(Walkathon) నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మొక్కజొన్న పరిశోధన స్థానం మరియు వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ పర్యవేక్షిస్తుండగా ఈ కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారు.
Also Read: Saffron Cultivation: ఆర్టిఫిషియల్ క్లైమేట్ తో కుంకుమ పువ్వు సాగు.!