ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో ఎండుతెగుమీ మిరప తోటల్లో మొక్కలు వడలి, ఎండిపోతున్నాయా ?లు / వేరుకుళ్ళు, కొమ్మ ఎండు తెగుళ్లు, తామర పురుగులు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే మిరప తోటల్నిఇవి ఆశించాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలా రాణి ఇలా తెలియజేస్తున్నారు.
* మిరపలో కొమ్మ ఎండు తెగులు సోకితే కొమ్మలు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ముదురు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కొమ్మ ఎండు తెగులు నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1మి.లీ. ప్రోపికొనజోల్ లేదా 2గ్రా. కాప్టాన్ + హెక్సాకొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* మిరపలో మొక్క ఎండుతెగులు తెగులు సోకిన తోటల్లో మొక్కలు వడలి ఎండిపోతాయి. పూత,పిందె,ఆకులు రాలిపోతాయి. మిరపలో ఎండుతెగులు / వేరుకుళ్ళు తెగులు నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండాజిమ్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.
* మిరపలో తామర పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచుల వెంబడి పైకి ముడుచుకు పోతాయి. ఆకులు, పిందెలు, రాగి రంగులోకి మారి పూత, పిందె నిలవదు. మిరపలో తామర పురుగుల నివారణకు ఎకరానికి 8-10 (నీలం, పసుపు, ఎరుపు రంగు) జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 2మి.లీ. థయాక్లోప్రిడ్ లేదా 2మి.లీ. క్లోర్ ఫెనపీర్ లేదా 2.5మి.లీ. టోల్ ఫెన్ పైరాడ్ లేదా 1.2గ్రా. డైఫెన్ థయూరాన్ మందుతో పాటు 5మి.లీ.1500 పిపిఎం వేపనూనె కలిపి పిచికారి చేయాలి.