Minister Niranjan Reddy: అమెరికాలో ని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఈ నెల 29 నుండి 31 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం హాజరుకానుంది. ఇక్కడ జరిగే వ్యవసాయ సంబంధిత అధ్యయనాలను వీరు పరిశీలన చేయనున్నారు. ప్రముఖ వ్యవసాయిక రాష్ట్రం అయిన లోవా మరియు నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి వ్యవసాయ సంబంధిత అంశాలపై పరిశీలన చేయనున్నారు. అనంతరం అమెరికా ఫెడరల్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, అమెరికా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి వ్యవసాయ రంగంలో నూతనంగా వచ్చిన మార్పులను వాతావరణ పరిస్థితులను ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తెలుసుకున్నారు.
Also Read: Tobacco Cultivation: రైతుల ఇంట సిరుల కురిపిస్తున్న పొగాకు సాగు.!
ఆధునిక సాంకేతిక, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం అదేం చేసి ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు ఈపర్యటన తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే అధ్యయనాలు చేపట్టానన్నారు. భవిష్యత్ లో ఆహార పరిశ్రమలకు రైతులకు వ్యవసాయం మరింత లాభసాటి చేసే యోచనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది,ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.