తెలంగాణ

19th Academic Council Meeting: పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం

2
19th Academic Council Meeting
19th Academic Council Meeting at PJTASU

19th Academic Council Meeting: హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరిగింది. డిప్లొమా, UG , PG, Phd కోర్సులకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, PJTSAU ఇంచార్జ్ ఉపకులపతి రఘునందన్ రావు ఆన్ లైన్ లో సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం డిప్లొమా, UG , PG, Phd కోర్సులకు సంబంధించిన వివిధ అంశాలపై కౌన్సిల్ కూలంకుషంగా చర్చించారు.

4 లక్షల రూపాయల సాయం

కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయిల్ సీడ్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అవినాష్ వనం తన పేరిట బంగారు పతకం అందించవలసినదిగా చేసిన విజ్ఞప్తిని కౌన్సిల్ ఆమోదించింది. ఈ బంగారు పతకం కోసం డాక్టర్ అవినాష్ వనం 4 లక్షల రూపాయల సాయం అందించనున్నారు.

Also Read: Chief Minister YS Jagan Mohan Reddy: 11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం జగన్‌ శ్రీకారం

19th Academic Council Meeting

19th Academic Council Meeting

ఈ డబ్బుపై వచ్చే వడ్డీతో వరంగల్ వ్యవసాయ కళాశాలలో Bsc అగ్రికల్చర్ కోర్సులో అత్యధిక ఓవరాల్ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏటా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నాడు బంగారు పతకాన్ని అందచేస్తారు. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 సీట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ ని 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఈకార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. వెంకటరమణ, వర్సిటీ అధికారులు, వివిధ ఫ్యాకల్టీ డీన్స్, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read: Finger Millets Cultivation: రాగి పంట సాగు విధానం..

Leave Your Comments

Chief Minister YS Jagan Mohan Reddy: 11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం జగన్‌ శ్రీకారం

Previous article

PM Kisan 14th Installment Release Date: తొందరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల..

Next article

You may also like