Telangana Weather Report: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆగష్టు 23 మధ్యాహ్నం 1 గంట నుంచి ఆగష్టు 24 ఉదయం 8.30 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. తర్వాత రోజు ఆగష్టు 24 ఉదయం 8.30 గంటల నుంచి ఆగష్టు 25 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. తర్వాత మూడు రోజుల్లో(ఆగష్టు 25 ఉదయం 8.30 గంటల నుంచి ఆగష్టు 28 ఉదయం 8.30 గంటల వరకు) అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సేల్సియస్ మధ్య నమోదుకావచ్చు. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. టొమాట పంటను స్టేకింగ్ చేయడం ద్వారా మొక్కలు కింద పడిపోకుండా ఉండి పంట నాణ్యత భాగా ఉంటుంది.
డా.పి. లీలా రాణి
ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం,
రాజేంద్రనగర్