వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్ కేటాయింపు..

0

ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం..
వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం విశేషం. ఒకవైపు కూలీలా కొరత ఉండటం, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడంలో కేంద్రం ఆసక్తి చూపించకపోవడంతో తెలంగాణ సర్కారు యాంత్రీకరణకు మొగ్గు చూపింది. భారీ కేటాయింపులతో రైతులను యాంత్రీకరణ బాటపట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. గత ఐదేళ్లులో ప్రభుత్వం రూ. 951 కోట్లు ఖర్చు చేసి 14,644 ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సబ్సీడీపై రైతులకు అందించింది. ఈసారి రూ. 25 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. రైతు బంధు పథకానికి తాజా బడ్జెట్ లో రూ. 14,800 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ లో రైతు బంధు పథకానికి రూ. 14 వేల కోట్లు పెట్టగా.. రూ.14,736 కోట్లు అవసరమయ్యాయి. కేటాయింపుల కంటే రూ. 736 కోట్లు అధికంగా విడుదల చేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నిధులు పెంచింది. గత బడ్జెట్ కేటాయింపుల్లో రెండు సీజన్లలో 59. 25 లక్షల మంది రైతులకు సొమ్ము వారి ఖాతాల్లో వేసింది. ఈసారి సాగు పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా రూ. 14,800 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్ లో రుణమాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించినా.. రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ. 1210 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
రైతు భీమా పథకానికి రాష్ట్ర బడ్జెట్ లో రూ. 1200 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందించడానికి భీమా కల్పించారు. గత ఏడాది బడ్జెట్ లో రూ. 1,141.4 కోట్లు మంజూరు చేసి 32.73 లక్షల మందికి భీమా కల్పించారు. ఈ ఏడాది కొంత పెంచారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ.3,400 చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లిస్తుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సున్న రైతులు.. ఈ భీమాకు అర్హులు. 2018 నుంచి ఇప్పటివరకు రైతు భీమా ద్వారా 46,564 రైతు కుంటుంబాలకు రూ. 2,328 కోట్లు పరిహారం అందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు బడ్జెట్ లో రూ. 122 కోట్లు కేటాయించింది. గతంలో కేవలం మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ లు నడిచేవి. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిధుల కేటాయింపు చేయడం గమనార్హం. కూరగాయలు, మాంసం, చేపలు.. అన్ని ఒకేచోట వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. గజ్వేల్ లో మరిన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లను అందుబాటులోకి తెచ్చే అందుకు సరకరు నిధుల కేటాయింపు చేసింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కూలీలా కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం. అందుకే కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారు. 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 30 వేల సబ్సీడీని రైతులకు ఇచ్చే అందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రాధమిక రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరు వల్ల గతేడాది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ జాతీయ స్థాయి కన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్ వీఏ) 20. 9 శాతం వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో ఈ రంగాల జీఎస్ వీఏ వృద్ధి 3 శాతమే. ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగ వృద్ధి రేటు మైనస్ 4.9 శాతానికి పతనయ్యాయి. అయితే జాతీయ స్థాయితో పోలిస్తే కొంత మేర మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలో పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.2 శాతానికి, సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.1 శాతానికి పతనమైంది.

Leave Your Comments

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

Previous article

ఖర్బుజ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like