Palm Oil Production: బీఆర్కే భవన్ లో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం కోసం నూతనంగా తయారుచేసిన మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు, ఎండీ సురేందర్, జేడీ సరోజిని, టీసీఎస్ ప్రతినిధులు రవి, తదితరులు పాల్గొన్నారు.

Palm Oil Production
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో పారదర్శకత కొరకు యాప్, పోర్టల్ అమలులోకి తీసుకురావడం జరిగిందని… రైతులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉద్యాన అధికారులు,ఆయిల్ పామ్ మరియు సూక్ష్మ సేద్య కంపెనీలు, నర్సరీ ఇంచార్జీలు ఒకే తాటిపైకి తీసుకురావొచ్చు అని అన్నారు. పధకం అమలు చేయుటలో రైతు నమోదు కార్యక్రమం నుండి రైతు/కంపెనీ ఖాతా లో రాయితీ జమ వరకు డిజిటల్ పద్ధతిలో సులభతరంగా నిర్వహించుట యాప్, పోర్టల్ ముఖ్య ఉద్దేశం. యాప్ లో రైతుకు సంబంధించిన పేరు, గ్రామము, మండలము, అడ్రస్, ఆయిల్ పామ్ సాగు చేపట్టదలిచిన పట్టాభూమి వివరాలు,విస్తీర్ణం,అందచేయబడిన మొక్కలు, సంబంధించిన నర్సరీ, మొక్కలకు, లేత తోటల యాజమాన్యం మరియు అంతర పంటల కొరకు అందించిన రాయితీ మొదలగు అన్నీ వివరములు యాప్ లో నమోదు చేసుకోవచ్చును.
ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్ ఉందని దేశంలో దాదాపు 9.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. దేశంలో, సాలీనా100 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా, వార్షిక ముడి పామ్ఆయిల్ ఉత్పత్తి ఏడాదికి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. ఈ లోటును దేశం దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు.
Also Read: Date Palm Cultivation: ఖర్జూరం సాగు ద్వారా 7 లక్షలు సంపాదిస్తున్న రైతు
దేశంలో పామ్ ఆయిల్ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అవసరం. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 52,666టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. అన్ని నూనె గింజల పంటలకన్నా ఆయిల్ పామ్ లో ఎక్కువ దిగుబడినిస్తుంది (ఎకరానికి 10-12 టన్నులు ), 25 – 30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయం పొందవచ్చు.
రాష్ట్రంలో వివిధ పధకాలకింద 2021-22 సం. వరకు 68,440 ఎకరాలు,(13,302 రైతులు) ఆయిల్ పామ్ సాగు కిందకు వస్తాయి. పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయింపు చేయడం జరిగింది.

Palm Oil Production Event
ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 38 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని.. ఆయిల్ పామ్ మొక్కలు,మొదటి నాలుగు ఏళ్లకు గాను యాజమాన్యం మరియు అంతర పంటల సాగు మరియు సూక్ష్మ సేద్యం కొరకు, ఎకరానికి రూ.50918/- వరకు రాయితీ కల్పించడం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
2022-23 ఏడాదికి గాను ఇప్పటివరకు 61277 ఎకరాలలో ప్రగతి సాధించడం జరిగిందని 2023-24 సం. కి గాను,2.00 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మొక్కల పెంచేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని మంత్రి అన్నారు.
Also Read: Oil Palm Cultivation: 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతున్నది.!
Also Watch: