- తెలంగాణ సాగు విధానాలపై అమెరికా ఆశక్తి
- యూఎస్ రాయభార కార్యలయ శాస్త్రవేత్త వెళ్ళడి
- వ్యవసాయ డీన్ జెల్ల సత్యనారాయణతో శాస్త్రవేత్త సంతోష్ కుమార్ సింగ్ భేటీ.
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయం విధానాలపై అమెరికా ఆశక్తి గా ఉందని ఢిల్లీలోని అమెరికా రాయభార కార్యాలయ శాస్త్రవేత్త సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. తెలంగాణ రైతుల నూతన సాగు విధానాలు అగ్రరాజ్యం పై ప్రభావం చూపాయన్నారు. తాజాగా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయాన్ని సందర్శించారు సంతోష్ కుమార్ సింగ్. ఈ క్రమంలో వ్యవసాయ డీన్ జెల్లా సత్యనారాయణ ఇతర అధికారుతో భేటీ అయ్యారు.
తెలంగాణలో పంటే పలు రకాల పంటలు, వ్యవసాయ సాగు పద్దతులు, రాష్ట్రంలో ఉన్న భూముల తీరు, వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తున్న బోధన, పరిసోధన, విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచ మత్స్య కార దినోత్సవం సందర్భంగా, తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుంచి 24 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద, సభాపతి గడ్డం ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Leave Your Comments