12th Grand Nursery Mela: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళా ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి22 వరకు ఈమేళా కొనసాగుతుంది. టెర్రస్, అర్బన్ గార్డెనింగ్ సంబంధించిన వాటికి పలురకాల సామాగ్రి, రకరకాల మొక్కలు, అలాగే అరుదైన మొక్కలు, జాతి మొక్కలు, పండ్ల మొక్కలు,కూరగాయల ,ఆకుకూరల విత్తనాలు, బోన్సాయ్ మొక్కలు రకరకాల పూల కుండీలు, ఔషధ మొక్కలు, అలంకరణ మొక్కలు, ఆకర్షణీయమైన మొక్కల కుండీలు అందుబాటులో ఉన్నాయి.
హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ ఫార్మింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా టెర్రస్,గార్డెనింగ్ ఏర్పాటు చేసుకునే వారికి ఇదొక అద్భుత అవకాశం.దేశంలోని వివిధ ప్రఖ్యాత నర్సరీలు ఈ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేశాయి.ఈ నర్సరీ మేళా ను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని ,మంత్రి హరీష్ రావు అన్నారు.మేళా లోని పలు రకాల స్టాల్స్ ఆయన సందర్శించారు . ప్రభుత్వం తన వంతుగా అర్బన్ గార్డెనింగ్ ప్రోత్సహిస్తుందని, వీటి వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని అని అన్నారు, గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తగిన తోడ్పాటు ఇస్తుందని అన్నారు, పిల్లలు తమ లైఫ్ స్టైల్ లో భాగంగా పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని సలహా ఇచ్చారు.
Also Read: High Yield Chilli Varieties: మిరపలో అధిక దిగుబడికి అనువైన రకాలు మరియు వాటి లక్షణాలు.!
సీఎం కేసీఆర్ విజన్ లో భాగంగా ఏర్పాటు చేసిన హరితహారం లో భాగంగా రాష్ట్రంలోని12751 గ్రామాల్లో పల్లె ప్రకృతి పేరుతో నర్సరీలు ఏర్పాటు చేశామని అన్నారు.పచ్చదనంలో ప్రస్తుతం 24 శాతం నుంచి33 శాతానికి పెంచుకునే దిశగా మొక్కల పెంపకాన్ని చేపట్టారు అని తెలియజేశారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని అడవులకు పునర్జీవం పోశారు అని, ఈనెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు అనిమంత్రి తెలియజేశారు.
కాగా ఈ మేళ దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత నర్సరీలు స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఈ మేళాలో 140స్టాల్స్ ఏర్పాటు చేశామని టెర్రస్, అర్బన్ గార్డెనింగ్ సంబంధించిన మొక్కలు, సామాగ్రి పలు రకాల విత్తనాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని మేళ ఎంట్రెన్స్ ధరపెద్దలకు 30 రూపాయలు, పిల్లలకు 20 రూపాయల గా నిర్ణయించామని నిర్వాహకులు తెలియజేశారు.
Also Read: Rainfall Impact on Crops: పంటల మీద వర్షపాత ప్రభావం ఎలా ఉంటుంది.!