telangana farmers protest తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చావు డప్పు మోగిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ కేంద్రం దిష్టి బొమ్మలు దహనం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లాల వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం నిరసనలకు పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై యావత్ రైతాంగం మండిపడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో చావు డప్పు మోగిస్తూ కేంద్రం దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. కొన్ని ముఖ్య కూడళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన రైతులు ధర్నాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురంల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన రైతులు
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటలో మోదీ దిష్టిబొమ్మను తెరాస నాయకులు దహనం చేశారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గోసాయిపల్లిలో మోడీ బొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు రైతులు మరియు నాయకులు.
నాగర్‌కర్నూల్ లో ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేసిన రైతులు.