ఈ రోజు దీక్ష చేపట్టనున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)
వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ‘‘వరి – ఉరి ప్రభుత్వ వైఖరిపై బిజెపి రైతుదీక్ష’’ చేపట్టనున్నారు. అక్టోబర్ 28న హైదరాబాద్ నాంపల్లిలోని బీజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దీక్ష కొనసాగనుంది.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేంటో అర్థం కావడం లేదు. రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసంగా లేదు. తరతరాలుగా సాంప్రదాయకంగా వరి మాత్రమే సాగు చేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా అకస్మాత్తుగా ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదు. వరి సాగు చేసే రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు, రైతులకు బీజెపి అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయ వ్యతిరేక వైఖరి వీడనాడాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘‘వరి – ఉరి ” ప్రభుత్వ వైఖరిపై బిజెపి రైతుదీక్ష’’ చేపట్టనున్నాం.
“వరి – ఉరి ” ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీజెపి రైతుదీక్ష
Leave Your Comments