‘‘పెద్దల మాట చద్ది మూట’’ అంటే పెద్ద వాళ్ళు ఏది చెప్పినా తమ అపార జీవితానుభవం రంగరించి చెప్తున్న మాటలను వేదవాక్కులా ఆచరిస్తే, ఆ మాటలు ఆదర్శ జీవనానికి హేతువు కాగలవు. మానవ మనుగడకు శక్తినిచ్చి తోడ్పడగలవు. అందుకే ‘పెద్దల మాట పెన్నిధి మూట’ అని కూడా అంటారు. పెన్నిధి అంటే తరగని పెద్ద నిధి అని, అందుకే పెద్దల మాట పెన్నిధి మూట లేదా చద్ది మూట అని అర్థం చేసుకోవాలి. గత 60 సంవత్సరాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివిన పూర్వ విద్యార్థులు విశిష్ట అతిథి హోదాలో వచ్చి వారి అపార అనుభవాన్ని వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో చేసిన కృషి, ప్రపంచవ్యాప్తంగా రైతుల సంక్షేమం, సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత కొరకు వారు చేసిన సేవలు, పరిశోధనలు, సామాజిక సేవ, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో వారు నేర్చుకున్న ఎన్నో జీవిత అనుభవాలను వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలో వివరించడం జరిగినది. ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలు పటిష్ట పరచడానికి, రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయం, రైతు సంక్షేమం, పోషకాహార భద్రత, రెట్టింపు ఆదాయం, విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కావలసిన కీలక సూచనలను చేయడం జరిగినది వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సహజ వనరుల యాజమాన్యం :
తరుగుతున్న వ్యవసాయ భూమి, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ కారణంగా తక్కువ పరిమాణం నుండి ఎక్కువ పరిమాణంలో వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తూ, మిక్కిలి ఆహార భద్రత కోసం కృషి చేయడం. పిండి పదార్థాలు అధికంగా ఉన్న పంటలను తగ్గిస్తూ ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహార ఉత్పత్తుల సాగు మరియు పెంపకాన్ని ప్రోత్సహించడం. పంటలు క్షేత్రస్థాయిలో బాహ్య పరిస్థితుల నుంచి తక్కువ ఒత్తిడికి లోనయ్యి అధిక దిగుబడులు సాధించే విధంగా వ్యవసాయ సాగు దిశగా ప్రయాణించడం తక్షణ అవసరం అని, ఆ దిశగా రైతులు ముందుకెళ్లాలని, శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలని శాస్త్రవేత్తలను కోరారు. తద్వారా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి పునర్ వైభవం వస్తుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. అదనపు వ్యవసాయ భూమి అందుబాటులో లేకపోవడం వల్ల, ఒక టన్ను పామాయిల్ వంట నూనె ఉత్పత్తి చేయడానికి సుమారు 0.26 హెక్టార్ల భూమి అవసరమని, తక్కువ భూమిలో ఎక్కువ నూనె ఉత్పత్తి కేవలం ఆయిల్ ఫామ్ సాగు ద్వారా మాత్రమే పొందగలమని తద్వారా వంట నూనెల దిగుమతిని తగ్గించవచ్చు అని అన్నారు. కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి సుమారు 5,000 లీటర్లు, ఒక ఎకరా వరి సాగుకు సుమారు 60 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతుంది. పప్పుధాన్యాల సాగు అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగంతో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి. అపరాల సాగు ద్వారా పంట మార్పిడి చేపట్టడం వలన నేల కోత మరియు భూసార క్షీణత తగ్గించి ఆరోగ్యమైన నేల తయారీకి ఉపయోగపడతాయి. ముఖ్యమైన పంటలో అంతర పంటగా, పంట మార్పిడి లో ప్రధాన పంటగా అపరాల సాగు చేసినట్లయితే ఎక్కువ మట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, సోయాబీన్, మరియు ఇతర నూనె గింజల్లో అపరాల సాగు అంతర పంటగా చేపట్టడం వలన జీవవైవిధ్యం పెరిగి, తక్కువ నీటి ఖర్చుతో సహజ ప్రకృతి ఆవిష్కరించడంలో తోడ్పాటు అందిస్తాయి. ఒకప్పుడు పుష్కలంగా దొరికే నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాము, అవసరానికి మించి వాడుతూ వృధా చేస్తున్నాం, భవిష్యత్తులో పుష్కలంగా మంచినీరు దొరుకుతుంది మరియు ఎన్నటికీ తరగదు అనే అపోహలో ఉండకుండా మంచినీటి సంరక్షణ, ఒడిసి పట్టుకోవడం, నీటి యజమాన్య పద్ధతులను పాటించడం, పంట మార్పిడి, తక్కువ నీటితో సాగు, సూక్ష్మ సేద్యం, అన్ని జిల్లాల్లో జల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం, అన్ని నీటి వనరులను లెక్కించడం, జియో-ట్యాగింగ్ %డ% జాబితా తయారు చేయడంబీ నీటి కోసం శాస్త్రీయ ప్రణాళికల తయారీ మొదలైన చర్యలను చేపడుతూ నీటి కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలకు ఆహార భద్రత కల్పిస్తూ నీటి కొరత లేకుండా సమస్త జీవుల మనుగడకు చర్యలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చాంద్ గారు మరియు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కెన్సేటేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వరప్రసాద్ గారు తెలిపారు.
తరుగుతున్న సహజ వనరులను పునరుద్ధరీకరిస్తూ రాష్ట్ర ప్రజలకు సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకాహర భద్రత మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, సేంద్రియ ఎరువులు, జీవ సంబంధ ఎరువుల వాడకాలను ప్రోత్సహిస్తూ, పురుగుమందుల వాడకాన్ని తగ్గిస్తూ పూర్తిగా భౌతిక పద్ధతుల ద్వారా పంటలలో చీడ పీడలు నివారించే దిశగా కృషి చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు మరియు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు శాస్త్రవేత్తలను కోరారు.
తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి పంటలను సాగు చేయడం తక్షణ అవసరం తద్వారానే నేల ఆరోగ్యం, పశుసంపద ఆరోగ్యం మరియు మానవ ఆరోగ్యం ఆవిష్కృతమవుతుంది అని ప్రపంచ స్థాయి పరిశోధన స్థానాల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు, పదవి విరమణ పొందిన అధికారులు పేర్కొన్నారు.
రైతు సంక్షేమం, ఆహార భద్రత మరియు విలువ జోడిరపు విత్తనంతోనే :
విత్తనం అనేది మన ఆహార వ్యవస్థలకు పునాది అంతేకాకుండా సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి, ఆహార భద్రతకు, వివిధ రకాల ఆహార పంటలకు విలువ జోడిరపు విత్తనం యొక్క రకం నుండే ప్రారంభమవుతుంది. వ్యవసాయానికి విత్తనం మూలాధారం, విత్తనం యొక్క నాణ్యత పైన ఆధారపడి ఇతర వ్యవసాయ ఉత్పాదకాల వినియోగం ఆధారపడి ఉంటుంది. విత్తనం మంచిగా ఉంటే పంట బాగుంటది అనే నానుడి మనకు తెలిసినదే. అందుకే రైతులు నాణ్యమైన విత్తనాల కోసం ఎంత దూరమైన వెళ్లి, ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తారని వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారు, రాష్ట్ర విత్తనాలు ఉత్పత్తి మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ అన్వేష్ రెడ్డి గారు తెలిపారు. నాణ్యమైన రకాలు మరియు విత్తనాల అభివృద్ధి దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలు కొనసాగాలని కోరారు. మనం టీవీ వివిధ మాధ్యమాలలో చూస్తున్న చాలా ఆహార పదార్థాల అడ్వర్టైజ్మెంట్స్ ను గమనిస్తే మనకు అర్థమవుతుంది. పలనా ఆహార పదార్ధం పలానా రకంతో తయారైనదని గొప్పగా చూపిస్తారు. కావున ఏదైనా ఆహార పంటకు విలువ జోడిరచాలి అంటే ముందుగా ఆహార పంట రకం ఏమిటి అన్నదానితోనే ఇది విలువ జోడిరపుకు లేదా ప్రాసెసింగ్కు అనువైనదా కాదా అని మార్కెట్లో నిర్ణయించబడుతున్నది. ప్రఖ్యాత ఆహార పరిశ్రమలు, సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు అన్నీ కూడా ఆహార పంట రకం, మరియు దాని యొక్క నాణ్యత లక్షణాలు ఆధారంగానే ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో అమ్మి లాభాలను గడిస్తున్నాయి. వివిధ రకాల ఆహార పంటలలోని నాణ్యమైన, బలవర్ధకమైన పోషక విలువలు ఆధారంగా, ప్రాసెసింగ్ చేయడానికి యంత్రాల పైనా అనువుగా ఉండడం, వాటి కుకింగ్ క్వాలిటీ బాగా ఉండడం, వాటికి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉండడం, తక్కువ సమయంలో ఉడకడం, ఎక్కువ కాలం వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలు నిలువ చేయడానికి అనువుగా ఉండడం,ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వండుకోవడానికి అనువుగా ఉండడం, అన్ని కాలాలలో లభ్యత, వినియోగదారుడు కి అన్నివేళలా వండడానికి అనువుగా ఉందని కోరుకోవడం, ఎక్కువ సమయం పాటు రవాణా చేసిన, నిలువచేసిన, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంట రకాలను ఆహార శుద్ధి పరిశ్రమలలో విరివిగా వినియోగిస్తారు. మార్కెట్లో చాలా రకాల ఆహార పంటల విత్తనాలు, మొక్కలు దొరుకుతాయి. వాటికి ఉన్న మార్కెటింగ్ డిమాండ్, దగ్గరలో ఉన్న ఆహార శుద్ధి పరిశ్రమలు, వివిధ కంపెనీల రిటైల్ రీ ప్యాకింగ్ సెంటర్స్ ను దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వివిధ పంటలలో మేలైన రకాలను అభివృద్ధి పరిచి రైతులకు అందించినట్లయితే, మన రైతు సోదరులు సాగు చేసి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది మన రాష్ట్ర రైతాంగానికి మన విశ్వవిద్యాలయం అందించే గొప్ప సేవ మరియు మరెన్నో కీర్తి ప్రతిష్టలు విశ్వవిద్యాలయం పొందే అవకాశం ఉంటుంది సమావేశంలో పాల్గొన్న వివిధ వక్తలు తెలిపారు.
ఏటా ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల ఆహార ఉత్పత్తులలో కేవలం 60 శాతం మాత్రమే మనం తింటున్నాము. సుమారు 23% పంట కోత నుండి రిటైల్ మార్కెట్ కు వచ్చే దారిలో వృధా అయిపోతుంది. మరో 7% రిటైల్స్ షాపులలో, ఇంకా 10 % మన ఇంటిలో, హోటల్స్ , మరియు ఇతర క్యాటరింగ్ వంటి ఆహార సేవలలో వృధా అవుతుంది. ఆహార ఉత్పత్తులు వృధా కావడం ద్వారా వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేయడానికి వాడిన ముఖ్యంగా భూసారం, విత్తనాలు, వ్యవసాయానికి వాడిన నీళ్లు, కరెంటు, విలువైన రైతుల సమయం, ఎరువులు, పురుగు మరియు తెగుళ్ళ మందులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందించిన వివిధ రకాల సబ్సిడీలు, వ్యవసాయ యాంత్రీకరణ కొరకు వాడిన విలువైన ఇంధన వనరులు, కూలీల ఖర్చు పంట కోతనంతరం చేసిన వివిధ ఖర్చులు మొదలైనవి సుమారు 38 శాతం శక్తి వినియోగం వృధాగా పోతున్నాయి. దీనికి తోడు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి పెంచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వెచ్చించిన కోట్లాది రూపాయల పరిశోధన మరియు విస్తరణ ఖర్చులు వృధా అయ్యే అవకాశం ఉంటది. కావున పంట కోతానంతరం నష్టాలను తగ్గిస్తూ, పొలం నుండి వంటశాల వరకు వ్యవసాయ విలువ గొలుసు ను పటిష్ట పరుస్తూ కృత్రిమ మేధా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, రోబోటిక్స్ మొదలైన సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల వృధాలు అరికట్టవచ్చని పూర్వ విద్యార్థి శ్రీనివాసులు శెట్టి గారు, చైర్మన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్ కింద ఇచ్చే సీబీఐ నిధులతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ లో ప్రయోగాలు జరిపి రాష్ట్ర రైతాంగానికి మరింత చేరువయ్యేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య గారు పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తుల వృధాను తక్షణమే తగ్గించడానికి వివిధ రకాల ఆవిష్కరణలు చేస్తూ నూతన ఆహార పరిశ్రమలను నెలకొల్పి ‘‘ధాన్యం ప్రాసెసింగ్, ధాన్యం ఉత్పత్తికి సమానం’’. కావున పండిరచిన పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి, విలువ జోడిరచి నాణ్యమైన ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది అని పూర్వ విద్యార్థి పారిశ్రామికవేత్త శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తెలిపారు. దేశంలో పెరుగుతున్నవివిధ వ్యవసాయ ఉత్పత్తులు, వాటి నిల్వ మరియు నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా విలువలు జోడిరచి రైతులకు మంచి గిట్టుబాటు ధరతో పాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం మరియు గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, ఆహార ఉత్పత్తుల ఎగుమతి ద్వారా దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సకాహాలను వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వక్తలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నరెడ్డి గారు, మరియు ఆర్థిక సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రాజయ్య గారు తెలిపారు.

సెకండరీ అగ్రికల్చర్ :
సెకండరీ అగ్రికల్చర్ ను ప్రోత్సహించడం, ముఖ్యంగా మూడు పంట కాలాలతో పాటు, పంట అవశేషాల నుండి అధిక శక్తినిచ్చే ఇందన వనరులు, ఎరువులుగా మార్చి జీవనోపాధితోపాటు ప్రాథమిక వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం. చిన్న భూభాగాల్లో ఆర్థికంగా నిలకడగా ఉండే స్థిరమైన, అధిక-దిగుబడినిచ్చే ప్రత్యేక వ్యవసాయం పైన ప్రయోగాలు జరపాలని మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నదెళ్ల భాస్కర్ రావు గారు, మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు సమరసింహా రెడ్డి గారు శాస్త్రవేత్తలను కోరారు.
క్షేత్రస్థాయిలో దృఢమైన వ్యవసాయ సైకిల్ ను నెలకొల్పడం :
వ్యవసాయ సైకిల్ – న్యూట్రి స్మార్ట్ క్రాప్స్ (బలవర్ధకమైన పోషక విలువలు కలిగిన పంటలను) సాగు చేయడం – మానవ ఆరోగ్యానికి మిక్కిలి మేలు చేసే పంటలను ముఖ్యంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు కూరగాయలు- అధిక మోతాదులో సాగు చేయడం – పర్యావరణానికి హాని చేయని పంటలను సాగు చేయడం – పంట సాగుతో పాటు జీవనోపాధికి ఉపయోగపడే సమీకృత వ్యవసాయం చేయడం – ప్రాసెసింగ్ మరియు విలువ జోడిరపుతో యువతకు, మహిళలకు మరియు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడం – చివరగా ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అన్ని ప్రాంతాలలో మరియు మార్కెట్లో అందుబాటులో ఉండే విధంగా చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు భావి వ్యవసాయ గ్రాడ్యుయేట్స్ పైన ఉంటుందని పూర్వ విద్యార్థి మాజీ మంత్రివర్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు అన్నారు.

రైతు పోషకాహారం మరియు ఉత్పాదకత సామర్థ్యం :
వ్యవసాయ పాడి పంటల ఉత్పత్తిలో ఉత్పాదకత కొలమానము. దీనిలో రైతు, రైతు కుటుంబ కూలీలు మరియు వ్యవసాయ కార్మికులు తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు వ్యవసాయ క్షేత్రంలో శ్రమించి మనందరికీ కావాల్సిన ఆహారం మన డైనింగ్ టేబుల్ మీద అన్నం ప్లేటు నిండి ఉండేలా కష్టపడుతున్నారు. అయితే ఉత్పాదకత పెంచే మార్గంలో రైతు పోషక ఆహారంలో లోపాలు ఉండడం వలన ఉత్పాదకత శక్తి తగ్గడం చూస్తున్నాము. మరోవైపు యువత వ్యవసాయం పైన అనాసక్తి, రైతు కుటుంబాలు పంట కాలవ్యవధుల ఆధారంగా కొన్ని పంటలను మాత్రమే పండిరచడం, రైతులు ఎక్కువ సమయం వ్యవసాయ క్షేత్రంలో ఉండటానికి ఇష్టపడకపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ రంగంలో వచ్చే లాభనష్టాలను ఇతర రంగాలతో పోల్చుకోవడం, చిన్న కుటుంబాలు, తగ్గుతున్న రైతు కుటుంబ కూలీలు , రైతు కుటుంబ సభ్యులు పట్టణాలకు వలస వెళ్లడం, పిల్లలు పై చదువుల కోసం ఇంటికి దూరంగా ఉండడం వలన పొలంలో కష్టపడే రైతులు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. కావున వివిధ వృత్తులకు దీటుగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడం, రైతు మరియు రైతు కూలీల పోషకార భద్రత పైన వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందించి విలువైన మానవ వనరులు అభివృద్ధి పరిచి భవిష్యత్తు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత మరియు మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచడానికి కార్యక్రమాలను అమలు చేసి పోషకాహార ఉత్పత్తి, తయారు చేసుకోవడం, మన కొంత భూభాగంలో సమతుల్య ఆహారాన్ని అందించే వివిధ పంటలను పండిరచుకోవడం పైన వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ( రైతు ఉత్పత్తిదారుల సంఘం) మరియు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పరచడం చాలా అవసరం. పెరటి కిచెన్ గార్డెన్లు, మిద్దె తోటలు స్థానిక ఆహారాలు మరియు కమ్యూనిటీ వ్యవసాయానికి మద్దతు ద్వారా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలసాగును పెంపొందించడం. పప్పు ధాన్యాలు రాష్ట్రంలో గ్రామీణ జనాభా కు కావలసిన ముఖ్యమైన పోషకాలు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అందించడంలో ఎంతో దోహదపడతాయి.
రానున్న రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, నాణ్యమైన విత్తనాల అభివృద్ధి, మొలక శాతం పెంపొందించే విధంగా చర్యలు మరియు క్షేత్రస్థాయిలో చీడపీడల మరియు తెగుళ్ళ నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన నిల్వ, పంట నిల్వ , ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ నిర్వహణ మొదలైన వాటికి సంబంధించి మరింత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి రాష్ట్ర రైతాంగానికి మెరుగైన సేవలు అందిస్తాదని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు పేర్కొన్నారు అంతే కాకుండా జాతీయస్థాయిలో యూనివర్సిటీ ర్యాంకు మొదటి పది స్థానాల్లో ఉండేందుకు కావలసిన చర్యలను బోధన, పరిశోధన మరియు విస్తరణ విభాగాలలో తీసుకువచ్చి కృషి చేస్తామని తెలిపారు.
మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పదవి చేపట్టిన ఎనిమిది నెలల్లో ఏకకాలంలో తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేశారు. రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు ఆర్థిక వెసలు బాటు కలిగి వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలు సమకూర్చుకొని ఈరోజు దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానానికి చేరి రైస్ బాల్ ఆఫ్ ఇండియా గా తెలంగాణ అవతరించిది. స్వయానా మన ముఖ్యమంత్రివర్యులు రైతు బిడ్డ కావడం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, వారి కుటుంబాల నుంచి ప్రపంచస్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించారు. సన్న వడ్లకు బోనస్, గతంలో నిలిపివేసిన వివిధ సబ్సిడీలు తిరిగి పునరుద్ధరించడం, నూతన ప్రాజెక్టులను చేపట్టడం, మూసి సుందరీకరణ, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ నియామకాలు, రైతు భరోసా, రైతు బీమా, భూభారతి వంటి పథకాలతో రైతులకు మరింత అండగా ఉండడానికి కృషి చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వజ్రోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు తన సందేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలు భవిష్యత్ రైతు సంక్షేమ కార్యక్రమాలు, పరిశోధనలు మరియు విస్తరణ కార్యక్రమాల ద్వారా యూనివర్సిటీ తెలంగాణ రైతులకు వెన్నుదన్నుగా ఉండాలని సందేశంలో కోరారు.

ఎ.పోశాద్రి, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.
Leave Your Comments