వార్తలు

పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఖరారు..

0

బ్యాంకులు పంటలకు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్ టీసీ) ఖరారు చేసింది. ఇటీవల సమావేశమైన ఈ కమిటీ రుణాలపై తుది నిర్ణయం తీసుకున్నది. జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్ టీసీ) లు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం వీటిని ఖరారు చేసింది. పాత జిల్లాలకనుగుణంగా పంట రుణాలను ఖరారు చేసిన రుణాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఏటా వివిధ పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ఎస్ ఎల్ టీసీ ఖరారు చేస్తుంది. ఇందులో భాగంగానే 2021 – 22 సంవత్సరానికి సంబంధించి సుమారు 54 పంటలకు రుణ పరిమితిని నిర్ణయించింది. వరి, ప్రత్తి పంటకు ఎకరాకు రూ. 35 వేల నుంచి 38 వేలుగా నిర్ణయించగా అత్యధికంగా చెరకు పంటకు రూ.70 వేల నుంచి 75 వేలు రుణంగా ఇవ్వనున్నారు. వాణిజ్య పంటలతోపాటు ఉద్యానపంటలకు కూడా ఎస్ ఎల్ టీసీ రుణాలను ఖరారు చేసింది.
పంటలవారీగా రుణాలు:
పంట రుణం ( రూ. వేలలో )
వరి, ప్రత్తి 35 -38
వరి విత్తనోత్పత్తి 42 – 45
ప్రత్తి విత్తనోత్పత్తి 110 – 140
చెరకు 70 – 75
మిరప 60 -70
వేరుశనగ 24 – 26
మొక్కజొన్న 25 – 28
జొన్న 15 – 20
సన్ ఫ్లవర్ 19 – 22
సోయాబీన్ 22 – 24
సోయాబీన్ విత్తనం 28 – 31
శనగ 20 – 22
పెసరు 15 – 17
మినుములు 15 – 18
కంది 17 – 20
గోధుమ, ఇతర చిరుధాన్యాలు 15 – 18
టమాటా 44 – 50
వంకాయ 45 – 48
అల్లం 58 – 63
పసుపు 35 – 38
క్యారెట్ 26 – 28
ఉల్లిగడ్డ 35 – 40
ఆలుగడ్డ 42 – 44
బెండ 22 – 24
ఉద్యాన పంటల్లో అత్యధికంగా చింతపండును రూ. 70 – 75 వేల రుణం ఖరారు చేయడం గమనార్హం.
పశువుల కొనుగోలుకు..
పంటలకే కాదు పశువుల కొనుగోలుకూ బ్యాంకులు రుణాలు అందించనున్నాయి. ఇందుకోసం ఏ రకం పశువులకు ఎంత రుణం ఇవ్వాలన్నది ఎస్ ఎల్ టీసీ ఖరారు చేసింది. దీని ప్రకారం గొర్రెల కొనుగోలుకు (21 గొర్రెలకు) రూ.11 – 12 వేల రుణం ఖరారు చేసింది. పౌల్ట్రీకి సంబంధించి బ్రాయిలర్ కోళ్లకు ఒక కోడికి రూ.145- 150, లెటర్స్ కోళ్లకు ఒక కోడికి రూ. 300 – 310 రుణం అందించనున్నది. బర్రెలు, ఆవుల కొనుగోలుకు సంబంధించి ఒక్కో పశువుకు రూ. 21 – 23 వేల రుణం ఖరారు చేసింది.

Leave Your Comments

వేస్ట్ డీకంపోజర్ పొడి.. 20 రూపాయలకే

Previous article

కినోవా పంట సాగు.. రైతు లాభాల బాట

Next article

You may also like