హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
తడిసిన, రంగు మారిన ధాన్యం కొంటాం.
రైతులెవరూ ఆందోళన చెందవద్దు.
అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలి. శానిటైజర్ ఉపయోగించాలి.
చివరి ఆయకట్టు రైతులకు ఆఖరుతడికి నీళ్ళందించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం.
వేసవిలో ప్రకృతివనాలలో చెట్లు ఎండకుండా ఈ రెండు నెలలు సర్పంచులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లందించి కాపాడుకోవాలి.
ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించి వెంటనే కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలి.
గ్రామాలలో పాడుబడ్డ ఇళ్లను ఈ రెండు నెలలలో గుర్తించి తొలగించి శుభ్రం చేయాలి.
అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సిద్ధంకావాలి.
పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
కరోనా విస్తృతి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించండి తప్పనిసరిగా మాస్క్ ధరించండి.
కరోనా నుండి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే తిరిగి ప్రజాసేవకు మీ ముందుకువస్తా.
హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..
Leave Your Comments