వార్తలు

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు.
ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహం.
దేశంలోని 72 వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో 10వ స్థానంలో తెలంగాణ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.
వన్ టైమ్ పికింగ్ పత్తి విత్తనాన్ని వృద్ధి చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం.
ఇది అందుబాటులోకి వస్తే పత్తి రైతులకు ఎంతో మేలు.
వణికించే చలిలో అయినా, ఉడికించే వేడిలో అయినా రైతు శ్రమిస్తాడు. ప్రపంచానికి ఆహారం అందిస్తాడు. ఆ రైతును కాపాడుకోవాల్సిన ప్రభుత్వం మీద, మనందరి మీదా ఉంది.
కరోనా నేపథ్యంలో వ్యవసాయరంగ ప్రాధాన్యతను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వమే.
తెలంగాణ ప్రభుత్వం చర్యల అనంతరమే కేంద్రం వ్యవసాయ రంగానికి కేంద్రం లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చింది.
గత సంవత్సరం వానాకాలంలో ఎఫ్ సీఐ 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. అందులో 54 శాతం తెలంగాణ నుండి సేకరించింది. కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ అన్నపూర్ణ నిలిచింది.
గత వానాకాలంలో మొత్తం కోటీ 45 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేశారు. ఈ యాసంగిలో మొత్తం 69.64 లక్షల ఎకరాలలో పంటలసాగు.
2013 – 2014 లో వానాకాలం, యాసంగి కలిపి 59.04 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగయ్యాయి.
దాదాపు వరి ఒక్కటే గత వానాకాలంలో 53.34 లక్షల ఎకరాలలో సాగు.
ఈ యాసంగిలో 52.73 లక్షల ఎకరాలలో సాగు.
ఈ యాసంగిలో వరి సాగులో దేశంలో మొదటిస్థానం.
పత్తి సాగులో దేశంలో రెండవస్థానం 60.54 లక్షల ఎకరాలు.
తెలంగాణ క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) లో నంబర్ వన్.
తెలంగాణ డాటా మూలంగానే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు చేయగలిగింది.
రైతులకు వ్యవసాయం గురించిన సమస్త సమాచారం అందించేందుకు రూ. 572.22 కోట్లతో రైతువేదికలు
ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మొలిచిన గొప్ప ఆలోచన రైతువేదికలు.
తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా కరోనా విపత్తులోనూ వ్యవసాయరంగంలో తెలంగాణ జీఎస్ డీపీ 20.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
కోటీ ఎకరాలకు నీళ్లందించే భాక్రానంగల్ 1948 లో మొదలుపెట్టి 1963లో పూర్తి చేసి నీళ్లు పారించారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అధిక వర్షాలతో పక్క రాష్ట్రాలలో సొయా దెబ్బతింది. కాబట్టి సొయా విత్తనం అందుబాటులో లేదు. తెలంగాణ రైతులు దీనికి ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలి.
రైతుబంధు కింద ఇప్పటి వరకు రూ.2936.23 కోట్లు ప్రీమియం చెల్లింపు.
నేటి వరకు 47,163 మంది రైతు కుంటుంబాలు రూ.2358.15 కోట్లు, భీమా సొమ్ము చెల్లింపు 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి గాను భీమా ప్రీమియం చెల్లించడానికి రూ.1200 కోట్లు బడ్జెట్లో కేటాయింపు
వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Leave Your Comments

వేసవిలో పశువుల గృహ వసతి నిర్వహణ..

Previous article

కివి పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like