Green Farming: శ్రీలంక పార్లమెంట్ సెషన్‌లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే (Gotabaya Rajapaksa) దేశం హరిత వ్యవసాయంపై ప్రసంగించారు. 2019లో అధికారం చేపట్టిన ఆయన 2050 నాటికి కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ నో న్యూ కోల్ ఎనర్జీలో శ్రీలంక ఇప్పటికే భాగమై ఉంది. భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా బొగ్గు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ఆమోదించబోము అని రాజపక్సే చెప్పారు.

Sri Lanka President Gotabaya Rajapaksa
విషరహిత హరిత వ్యవసాయంపై తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై మొదట్లో అపనమ్మకం ఏర్పడటం వాస్తవం. కొన్ని నిర్ణయాలు ప్రజల కష్టాలకు దారితీసినందున మేము వాటిలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది అని రాజపక్సే పేర్కొన్నారు. అయినప్పటికీ హరిత వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. వ్యవసాయంలో అధిక ఉత్పాదకతను సాధించడానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేయడం మరియు విషరహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించేందుకు బయో-ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం మా అంతిమ లక్ష్యం అని అధ్యక్షుడు చెప్పారు.

Green Farming
వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న మరియు అనుబంధ సేవలను అందించే ప్రజల ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా బలోపేతం అవుతుందని రాజపక్సే చెప్పారు. 2022 సంవత్సరంలో ఆహార భద్రతకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. దేశంలోని ప్రతి సాగు భూమిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శ్రీలంక ప్రజలు ఏకం కావాలని మరియు సాగు ప్రయత్నాన్ని ప్రారంభించాలని అధ్యక్షుడు కోరారు. ఇక దేశంలో నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు.
Also Read: శ్రీలంకలో కేజీ ఉల్లిగడ్డల ధర రూ.600

Green Farming in Sri Lanka
పునరుత్పాదక శక్తి: విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు లంకకు చాలా పరిమితమైన సహజ వనరులు ఉన్నాయని అయితే మా వద్ద చమురు, గ్యాస్ మరియు బొగ్గు వంటి వనరులు లేవు వాటన్నింటినీ దిగుమతి చేసుకోవాలి. 2030 నాటికి దేశంలోని 70 శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. ఇక గత ఏడాది భారత్‌తో కుదుర్చుకున్న రూ. 20 బిలియన్ల రుణ సదుపాయంతో ప్రభుత్వ కార్యాలయాల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు రాజపక్సే తెలిపారు.

Green Farming
కాగా.. శ్రీలంక గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి పెరగడంతో దివాలా అంచున పయనిస్తోంది.
Also Read: ఎర్రచందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?