వార్తలు

భూసార పరీక్షలు ఇక నుంచి రైతు వేదికల్లో ..

0

భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు వీలుగా గతంలో మంజూరు చేసిన చిన్న ప్రయోగశాలలను రైతువేదిక భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్ల వారీగా ల్యాబ్ ను వాటిలో ఏర్పాటు చేసి భూసార పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొనడంతో రెండేళ్లుగా వృథాగా ఉన్న పరికరాలు ఉపయోగంలోకి రానున్నాయి. మట్టి సేకరణ, భూసార ఫలితాల పట్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అవసరం ఉన్నా .. లేకపోయినా ఎరువులను వాడకం పెరుగుతుంది. రైతు వేదికల్లోకి ల్యాబ్ లను మార్చి క్లస్టర్ స్థాయిలోనే రైతులు మట్టి నమూనాలు తీసుకెళ్లి వాటి ఫలితాలు పొందేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రధాన పంట ప్రత్తి కాగా తరువాత సొయా, కంది తదితర పంటలను సాగు చేస్తారు. పశుసంపద తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. ప్రతి రైతు తమ భూమికి సంబంధించిన సారాన్ని తెలుసుకొని సాగు చేస్తే ఆశించిన దిగుబడులు సాధించే అవకాశం ఉంది. క్లస్టర్ల పరిధిలోనే రైతులు భూసార ఫలితాలు తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంజూరు చేసిన ల్యాబ్ లను రైతు వేదికల్లోకి మార్చమని ప్రభుత్వం ఆదేశించింది.

Leave Your Comments

నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

ముందుగానే వ్యవసాయ యంత్రాల్ని బుక్ చేసుకునే వెసులుబాట కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

Next article

You may also like