Seed Mela at Jagityal: జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా ఈ నెల 24 వ తేదీన ఘనంగా నిర్వహించినట్లు పరిశోధన స్థానం అసోసియేట్ డైరక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్. ఉమా దేవి గారు తెలిపారు. ఈ మేళా లో వ్యవసాయానికి సంభందించిన సాగు వివరాలు, సస్య రక్షణ పద్దతులు, నేల మరియు నీటి యాజమాన్య పద్ధతులు, వరికి ప్రత్యామ్నాయ పంటలు, పంట వైవిద్యం, పంట మార్పిడి, వ్యవసాయ మనిమూట్ల వాడకం వంటి వివిధ అంశాల మీద రైతులు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: How Methane Released in Farming: మీథేన్ భూమి నుండి ఎలా వస్తుంది, ఏ విధంగా హాని చేస్తుంది?
ఈ మేళాలో వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ ” సదా రైతు సేవలో నిమగ్నమయి ఉన్నాము, వారి కోసం కావలసిన వంగడాలను రాబోయే కాలంలో తయారు చేస్తున్నాము. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం “అని అన్నారు. అలాగే ఈ మేళాలో అన్నీ విధాలా నాణ్యమైన వివిధ వరి రకాల విత్తనాలను కూడా అమ్మకానికి ఉంచుతున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్. గున్యా నాయక్ తెలిపారు.
ఈ విత్తన రేట్లను పరిశీలించిన, దొడ్డు రకాలైన జే. జి.ఎల్ 24423, బతుకమ్మ రకాలకు 25 కిలోల విత్తనాలు 1000/- రూపాయలకు, ప్రాణహిత 20కిలోల విత్తనానికి 800/- రూపాయలు, సన్న రకాలైన ప్రత్యుమ్న , జే. జి.ఎల్ 28545, అంజన రకాలు 25 కిలోలకూ గాను 880/- , జగిత్యాల మాషూరి 1550/- రూపాయలకు రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాల శాస్త్రవేత్తలచే విత్తనోత్పత్తి చేసి ప్రాసెసింగ్ చేయబడిన ఫౌండేషన్ మరియు ట్రూత్ ఫుల్లీ లాబెల్డ్ విత్తనాలను అమ్మారు.దాదాపు 200 మంది రైతులు ఈ సేవలను వినియోగించుకున్నారు.
Also Read: Eutrophication Losses: యూట్రోఫికేషన్ గురించి ప్రతి రైతు తెలుసుకోవలసిన విషయాలు.!