Seed Importance: రాజేంద్రనగర్ లోని తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం(TISTA) లో నేటి నుండి ఈ నెల 25 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి దేశానికే ఆదర్శవంతమైన విధానాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి ఉచిత కరంటు పథకాలు దేశానికే ఆదర్శం. వ్యవసాయంలో విత్తనాన్ని ఒక ప్రముఖ అంశంగా భావించి, విత్తన రంగాన్ని సమగ్రంగా అభివృద్ది చేసి, తెలంగాణ ను ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాడానికి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది.
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలకే కాకుండా, ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రంలో(TISTA), మొదటి సారిగా అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్ షాప్ ను నిర్వహించడం ఎంతో గర్వకారణం.
తెలంగాణ విత్తన పరిశ్రమకే కాకుండా, భారత విత్తన పరిశ్రమకు సేవలు అందించడానికి అత్యాధునిక టెక్నాలజీ తో ఈ TISTA విత్తన పరీక్ష ల్యాబ్ ను అందుబాటులోకి తేవడం జరిగింది. విత్తనోత్పత్తిదారులకు & ప్రభుత్వ రంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వర్క్ షాప్ ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ది చేయడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
రాజేంద్రనగర్ లోని తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం(TISTA) లో నేటి నుండి ఈ నెల 25 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా ప్రెసిడెంట్, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు, ఇస్టా సెక్రెటరీ జనరల్ ఆండ్రియాస్ వైస్ (స్విట్జర్లాండ్), ఇండో-జర్మన్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎక్కెహార్డ్ షోడర్ (జర్మనీ), విత్తన నమూనాల సేకరణ అనుభవజ్ఞుడు ఎడ్డీ గోల్డ్ శాగ్ (సౌత్ ఆఫ్రికా), ఇస్టా విత్తన జెర్మినేషన్ కమిటీ సభ్యులు సిల్వీ డోకర్నూ (ఫ్రాన్స్), విత్తన పరీక్ష కమిటీ సభ్యులు సూయి కసిన్స్ (న్యూజీల్యాండ్) తదితరులు పాల్గొన్నారు
వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు వ్యాఖ్యలు-
ఈ ISTA ల్యాబ్ లో అత్యాధునిక టెక్నాలజీ తో విత్తన పరీక్ష చేసే యంత్రాలను నెలకొల్పడం జరిగిందని ఈ అవకాశాన్ని ఇండియా నుంచి మరియు ఇతర దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయ విత్తన నిపుణుడు ఎడ్డీ గోల్డ్ శాగ్ (సౌత్ ఆఫ్రికా) వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు, సదుపాయాలతో పాటు ప్రభుత్వ సహకారం ఎంతో ఉంది. తెలంగాణలో విత్తన రంగం ఎంతో అభివృద్ది చెందింది అన్నీ, అందుకే ఇలాంటి అంతర్జాతీయ స్థాయి విత్తన కార్యాక్రమాలకు హైదారాబాద్ వేదిక అయ్యింది
ఎండీ కేశవులు వ్యాఖ్యలు-
ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో, విత్తన నమూనాల సేకరణలో అనుభవజ్ఞులైన ఎడ్డి గోల్డ్ షాగ్(సౌత్ ఆఫ్రికా), విత్తన స్వచ్ఛత పరీక్షలో అనుభవజ్ఞులైన సిల్వీ దోకర్నూ (ఫ్రాన్స్) మరియు విత్తన మొలక పరీక్ష లో అనుభవజ్ఞులైన సూ కసిన్స్ (న్యూజీల్యాండ్) లాంటి అంతర్జాతీయ స్థాయి విత్తన ప్రముఖులచే ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
ఈ వర్క్ షాప్ లో ఇండియా తో పాటు టాంజానియా, కెన్యా, ఇండోనేషియా, డెన్మార్క్, సౌత్ కొరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, సెనిగల్ దేశాల నుండి జాతీయ & అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ & ప్రైవేట్ రంగ సంస్థల చెందిన 25 మంది ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ మరియు ISTA ప్రసిడెంట్ డా. కేశవులు తెలిపారు.
అదేవిధంగా ఈ వర్క్ షాప్ లో భాగంగా నవంబర్ 22 న హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్న విత్తన పరిశ్రమ, ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన అధునాతన విత్తన ప్రాసెసింగ్ సౌకర్యాలను, విత్తనోత్పత్తి క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది.
Must Watch:
Leave Your Comments