ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Redgram: ఏయే కంది రకాలను రబీలో సాగుచేసుకోవచ్చు ?

1
Redgram
Redgram

Redgram: నీటివసతి ఉన్న ప్రాంతాల్లో రబీ(యాసంగి) కందిని సెప్టెంబర్ నెలలో విత్తుకోవచ్చు.రబీలోసాగుచేయడానికి ప్రత్యేకమైన కంది రకాలు ఏమీ ఉండవు. ఖరీఫ్ లో సాగుచేసే రకాలే రబీలో సాగు చేసినప్పుడు త్వరగా పంటకొస్తాయి. 30-40 రోజులు పంటకాలం తగ్గుతుంది. కాబట్టి స్వల్పకాలిక కంది రకాలను రబీలో సాగుచేయరాదు. 160 రోజుల పంటకాలం గల మధ్య స్వల్పకాలిక రకాలు,170-180 రోజుల పంటకాలం గల మధ్యకాలిక కంది రకాలు రబీలో సాగుకు అనుకూలం. తెలంగాణాలో రబీ సాగుకు కందిలో టి.డి.ఆర్.జి.4 , ఐ.సి.పి.హెచ్.-2740 , ఐ.సి.పి.-8863 (మారుతి), ఎల్.ఆర్.జి.- 41,ఎం.ఆర్.జి. -1004,డబ్ల్యు.ఆర్.జి.- 65 ,డబ్ల్యు.ఆర్. జి.-53, డబ్ల్యు.ఆర్.జి.-255, టి.డి.ఆర్.జి.-59 రకాలు అనువైనవి.ఈ రకాలన్నీ నాలుగైదు నెలల్లోనే పంటకొచ్చి, ఎకరాకు సుమారు 8 -10 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తాయి.

టి.డి.ఆర్.జి.4 రకం ఫ్యూజేరియం ఎండుతెగులును పూర్తిగా, శనగపచ్చ పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. ఐసిపిహెచ్-2740 రకం ఫ్యూజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఇది నల్లరేగడి భూముల్లో నీటి పారుదలకింద సాగుకు అనువైన సంకర రకం. ఐసిపి-8863 (మారుతి) రకం ఎండు తెగులును తట్టుకుంటుంది.మొక్కలు నిటారుగా పెరుగుతాయి. ఎల్ఆర్ జి -41 రకం శనగ పచ్చ పురుగును తట్టుకుంటుంది.పైరు ఒకేసారి పూతకు రావడం వల్ల కొమ్మలు వంగుతాయి. ఎమ్ఆర్ జి -1004 రకం మాక్రోపోమినా ఎండు తెగులును తట్టుకుంటుంది. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. డబ్ల్యు.ఆర్. జి-65 రకం ఫ్యూజేరియం ఎండుతెగులును, శనగపచ్చ పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. డబ్ల్యు.ఆర్.జి.-53 రకం కొంతవరకు శనగ పచ్చ పురుగును తట్టుకుంటుంది. టి.డి.ఆర్.జి.-59 మధ్యస్థ లావు గింజ రకం. ఫ్యూజేరియం ఎండుతెగులు కొంత వరకు తట్టుకుంటుంది. డబ్ల్యు.ఆర్.జి.-255 లావు గింజ రకం. ఎండుతెగులును సమర్థంగా తట్టుకుంటుంది.

Leave Your Comments

Outlook India National Awards: ఏపీలో ముగ్గురికి ఔట్‌లుక్ ఇండియా జాతీయ అవార్డులు

Previous article

Rainy Season Crops: వానాకాలం పంటల అంచనా ధరలు…సెప్టెంబర్- అక్టోబర్ లో ఎలా ఉండబోతున్నాయి ?

Next article

You may also like