Rythu Bandhu: వర్షాకాలంలో రైతులకి సహాయంగా పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 26 సోమవారం నుంచి ‘రైతు బంధు’ రైతుల అకౌంట్లో అందించాలి అని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకం మొదలు చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ రైతులకి పెట్టుబడి కోసం రైతు బందు ఇవ్వడం ద్వారా రైతులకి చాలా ఉపయోగపడుతుంది.
వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకి ఉపయోగ పడడానికి పథకం నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బ్యాంకు ఖాతాల్లో నుంచి నిధులు సులువుగా వాడుకోవచ్చు. రైతు బంధు పథకం కోసం 7,500 కోట్లు సమీకరించాలని ఆర్థిక శాఖ అధికారులని ఆదేశించారు.
Aquaponics: ఆక్వాపోనిక్స్‌లో పూల మొక్కల పెంపకం
ఈ వానాకాలం నుంచి కొత్తగా పోడు భూమి రైతులకి రైతుబంధు పథకంతో నిధులు అందిస్తున్నారు. పోడు భూమి రైతులకి పట్టాను పంపిణి చేసి రైతుబంధు ద్వారా పోడు భూమి రైతులకి ఎకరానికి 5000 రూపాయలు ఇస్తారు అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
ఈ పథకం ద్వారా ఇప్పటికి రైతుబంధుతో తెలంగాణ ప్రభుత్వం 65,559.28 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ ప్రకారం 15,075 కోట్లు కేటాయింపు చేశారు. రబీ రబీ 2022-23లో 70.54 లక్షల మంది రైతులు రైతుబంధు పథకంతో పెట్టుబడికి సహాయం పొందారు.
Gogu Cultivation: గోగు పంటసాగులో సిరులేనంట.!