Rythu Bandhu: ఎన్ని ఇబ్బందులు ఎదురయినా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ నెల 28 నుండి 9వ విడత రైతుబంధు సాయం అందుతుంది అని తెలిపారు. కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా ఆగని రైతుబంధు పథకం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయ రంగం పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం అని అన్నారు.

Rythu Bandhu Secheme
Also Read: PJTSAU: ముగిసిన “ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్” కార్యక్రమం
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతుబంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. వానాకాలం, యాసంగి సాగులో రైతాంగానికి ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. ఈ ఏడాది వ్యవసాయం బాగుండాలని, పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి రైతుబంధు సాయం ఆసరా అవుతుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.
ఈ నెల 28 నుండి రైతుబంధు అమలుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులయిన రైతుల వివరాలు పంపించాలని సీసీఎల్ఏను వ్యవసాయ శాఖ కోరింది. గత ఏడాది వానాకాలంలో వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్ల రైతుబంధు సాయం అందింది.
గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7412.53 కోట్ల రైతుబంధు సాయం లభించింది. 2022 – 23 సంవత్సరానికి గాను బడ్జెట్ లో రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయింపు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో రూ.50,447.33 కోట్ల సాయం అందింది. ఈ నెల 28 నుండి యధావిధిగా రైతుబంధు సాయం .. గతంలో మాదిరిగానే రోజుకు ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాలలో నిధులు జమ చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పక్షాన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: TS Agri Minister Niranjan Reddy: ప్రధానమంత్రి కిసాన్ ‘ఘాఠా‘ యోజన -నిరంజన్ రెడ్డి