Rythu Bandhu: 1,87,847 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వెల్లడించారు. మొత్తం 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 56 లక్షల 58 వేల 484 మంది రైతుల ఖాతాలలో రూ.4754.64 కోట్లు జమ చేసాం. ప్రతి రైతుకు రైతుబంధు సాయం .. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తిచేస్తాం. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు.
Also Read: Sugarcane Harvester: యంత్రాలతో చెరకు కోత ఎంతో మేలు.!
కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని మంత్రి నిరంజన్ రెడ్డి సగర్వంగా వెల్లడించారు. ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వంద శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసే ముందు, ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం మీద బురదజల్లడం విపక్షాలు, ఒక సెక్షన్ మీడియా లక్ష్యంగా పెట్టుకున్నాయని మంత్రి అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నదని మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సగర్వంగా వెల్లడించారు.
Also Watch: