-
తెలంగాణాలో జోరుగా రైతుబంధు కార్యక్రమం
-
ఏడో రోజు రైతుల ఖాతాలోకి రూ.201.91 కోట్లు జమ
-
ఊరూరా రైతులు రైతుబంధు సంబరాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
Rythu Bandhu 7th Day కొత్త సంవత్సరం సందర్భంగా రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. విడతల వారీగా సొమ్ముని రైతు ఖాతాలోకి బదిలీ చేస్తుంది. ఆరు రోజులుగా రైతుబంధు కొనసాగుతుంది. ఇక ఏడో రోజు కూడా రైతుల ఖాతాలోకి రూ.201.91 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 60,16,697
మంది రైతుల ఖాతాలకు రూ.6008.27 కోట్ల నిధులు బదిలీ అయ్యాయి.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఈ దేశంలో రైతులకు చేయూతనిచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు వ్యవసాయరంగానికి ఊపిరిపోశాయని ఆయన తెలిపారు.ప్రభుత్వాల సహకారం లేక వ్యవసాయానికి దూరమైన రైతన్నలకు ఆత్మస్థయిర్యం నింపాయి. Rythu Bandhu 7th Day
సమైక్య పాలనలో ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కున్న రైతులు తిరిగి వ్యవసాయరంగం వైపు మళ్లారు ఈ ఘనత, ఈ భరోసా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని చెప్పారు. అందుకే ఊరూరా రైతులు రైతుబంధు సంబరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీరాజనాలు పడుతున్నారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో స్పష్టమయిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Telangana Agriculture News, Rythu Bandhu Latest News, CM KCR, Minister Niranjan Reddy