Maharashtra Farmers: రైతుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. వారి ఆదాయాన్ని పెంచేందుకు వివిధ పథకాల ద్వారా సహాయం అందజేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీని ప్రకటించినప్పుడే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు దీని కోసం 10 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. మహాత్మా జ్యోతిబా ఫూలే పంట రుణాల పథకం కింద బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాన్ని తిరిగి ఇస్తే, వారికి ప్రభుత్వం 50 వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెప్తున్నది.
ఈ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర డిప్యూటీ సిఎం మరియు ఆర్థిక మంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ పథకాన్ని 2 సంవత్సరాల క్రితం 2020-21లో ప్రారంభించిందని, అయితే ఆర్థిక సమస్య కారణంగా దీనిని అమలు చేయలేకపోయామని అన్నారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది కాబట్టి ఈ పథకం లబ్ధిని రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: సస్యరక్షణ లో వేప ఉత్పత్తుల వాడకం
ఇది కాకుండా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం గతేడాది కంటే 21 వేల 840 కోట్లు కేటాయించింది. గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం 20 వేల 191 కోట్లు కేటాయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా రైతు నాయకులు సంతోషించడం లేదన్నారు.
కిసాన్ సభకు చెందిన అజిత్ నవాలే మాట్లాడుతూ.. పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. 2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకే ప్రభుత్వం ఊరట కల్పించిందన్నారు. ఇంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి ఉండాల్సిందని అయాన్ అభిప్రాయపడ్డారు.
కాగా మండీలను బలోపేతం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు మండీలు రుణాలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.10 వేల కోట్లు కేటాయించారు.
Also Read: ఆరోగ్యానికి తాటి బంగారం