Nanded Farmers: గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా నాందేడ్ జిల్లాలో ఖరీఫ్ పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి.దిగుబడి బాగా తగ్గిపోయింది. సోయాబీన్‌తో పాటు ఇతర పంటలు కూడా పెద్ద ఎత్తున నాశనమయ్యాయి. దీంతో బాధిత రైతులు ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని రైతు ఖాతాలో జమ చేసింది. మిగిలిన గ్రాంట్ మొత్తాన్ని కూడా వచ్చే 15రోజుల్లో రైతులకు అందజేస్తామని బ్యాంకు తెలిపింది.
Also Read: అకాల వర్షాలతో మిర్చి రైతుల ఆందోళన
నాందేడ్ జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.238 కోట్ల పరిహారం అందించారు. దీంతో రైతులకు కొంత ఊరట లభించింది. గతేడాది మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో జిల్లాలో అతివృష్టికి 66,464 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. దీంతో ప్రభుత్వం రూ.424 కోట్ల పరిహారం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు రూ.238 కోట్లు రైతులకు అందించారు. గత నెలన్నర రోజులుగా నిధులు పంపిణీ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రూ.238 కోట్లకు పైగా గ్రాంట్ రాగా.. మిగిలిన మొత్తాన్ని రైతులకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా బ్యాంకు అధికారులు తెలిపారు.
కాగా.. ఖరీఫ్ సోయాబీన్ పంట తీవ్ర వర్షాభావంతో నాశనమై దిగుబడి తక్కువగా ఉండటంతో సోయాబీన్ పంటకు మంచి ధర పలికింది. కానీ తరువాత సోయాబీన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత రైతులు సోయాబీన్‌ను నిల్వ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం రైతులు 6000 నుండి 6500 వరకు ధర పొందుతున్నారు. దీంతో జిల్లా రైతులు ప్రస్తుతం వేసవిలో సోయాబీన్‌ను విరివిగా విత్తడం ప్రారంభించారు.
Also Read: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు…