సాధారణ స్థాయి దాటి మిరపకాయ కారం మోతాదుకి మించిన ఏమాత్రం తట్టుకోలేం. అయితే అత్యంత ఘాటైన మిరప రకాల్లో ఓ రకం మిరపను పట్టణానికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు వార్త మల్లేశం తన ఇంటి పెరట్లోని కుండీలలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల మధ్య పెంచుతున్నారు. వారం రోజుల నుంచి కాయలు కాస్తూ ఈ మిరప తన ప్రత్యేకతను చాటుతుంది. వృక్ష రాజ్యంలోని సొలనేని కుటుంబానికి చెందిన ఈ మిరప రకాన్ని “డల్లే కుర్సని” అనే పేరుతో పిలుస్తారని సిక్కిం రాష్ట్రంలో ఈ మిరప భౌగోళిక గుర్తింపు పొందిందని దీన్ని చెర్రీ చిల్లి, రౌండ్ చిల్లి అనే పేర్లతో కూడా పిలుస్తారని పేర్కొన్నారు. దీని కారం లక్ష నుంచి 3.5 లక్షల ఎస్ హెచ్ యు (కారం కొలిచే ప్రమాణం స్కావిల్ స్కెల్ యూనిట్స్) ఉంటుందని మనం వాడే మిరప కేవలం 30 వేల ఎస్ హెచ్ యు వరకే ఉంటుందన్నారు. మన దేశానికి చెందిన ఈ మిరప ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయల జాబితాలో ఉందని ఇందులో విటమిన్ ఏ, ఈ, పొటాషియం మెండుగా, సోడియం తక్కువ స్థాయిలో నారింజ పండులో కన్నా 5 రెట్లు విటమిన్ సి ఉంటుందన్నారు. విహార యాత్రలకు వెళ్లిన ఈ విత్తనాలను సేకరించినట్లు వివరించారు.