Richest Farmers In India కఠోర శ్రమతో పాటు స్మార్ట్ వర్క్‌కు ప్రాధాన్యతనిస్తూ భారతీయ వ్యవసాయానికి కొత్త రూపురేఖలు తెచ్చిన రైతులు ఎందరో ఉన్నారు. కానీ వ్యవసాయం చేస్తూ కోటీశ్వరులు అవ్వొచ్చు అని నీరుపించారు ఈ రైతులు.
ప్రమోద్ గౌతమ్ (Pramod Gautam) ఒక మాజీ ఆటోమొబైల్ ఇంజినీర్. 2006వ సంవత్సరంలో తన రంగాన్ని విడిచిపెట్టి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. తనకున్న 26 ఎకరాల్లో సేద్యం చేస్తూ ఏడాదికి దాదాపుగా కోటి రూపాయలకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. కానీ దానివెనుక ఎంతో కష్టం దాగి ఉంది. వ్యవసాయ రంగానికి కొత్తగా వచ్చిన ప్రమోద్ మొదట ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ముందుగా తెల్ల వేరుశెనగ, పసుపు పంట వేసి నష్టపోయాడు. తర్వాత యంత్రాల సహాయం తీసుకుని తక్కువ శ్రమతో వ్యవసాయానికి నాంది పలికాడు. 2007-08 తర్వాత వ్యవసాయంపై పూర్తి అవగాహన పెంచుకుని నారింజ, జామ, నిమ్మ, ఇలా అనేక రకాల పండ్లు, కూరగాయలు పండించాడు. కొంతకాలం తర్వాత ఇదే రంగానికి చెందిన మిల్లులు ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని కోటికి చేర్చాడు.
నాగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీర్ చదివిన సచిన్ కాలే (Sachin Kale) పవర్ ప్లాంట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు 2013లో తన వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టి వ్యవసాయానికి వెల్ కమ్ పలికాడు.సంవత్సరానికి 24 లక్షల రూపాయలు సంపాదన వదిలి వ్యవసాయ రంగానికి వచ్చాడు. అగ్రికల్చర్ పై ఎటువంటు అనుభవం లేని సచిన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కాన్సెప్ట్‌తో 2014లో సొంత సంస్థను స్థాపించాడు. ప్రస్తుతం, అతని కంపెనీ 200 ఎకరాల్లో ఉంది. ఆ సంస్థలో 137 మంది ఎంప్లాయిస్ ఉన్నారు. సచిన్ సుమారుగా ఏడాదికి రెండు కోట్లు సంపాదిస్తున్నాడు.
హరీష్ ధందేవ్ (Harish Dhandev) ఒక విజయవంతమైన రైతు, అతను భారతదేశంలోని మొదటి ఐదు సంపన్న రైతులలో మూడవ స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్‌లో అలోవెరా పండించడం ప్రారంభించడానికి అతను తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఆ తరువాత, అతను జైసల్మేర్‌లోని తన పూర్వీకుల ఎస్టేట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. రైతుల ఆలోచనలను, వ్యవసాయ నిపుణులతో అనుసంధానం చేసే సేవలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో హరీష్ తన పరిశోధనను నిర్వహించారు. మొదట్లో 80 వేల అలోవెరా మొక్కలను నాటగా అవి ఆరు నెలల్లోనే ఏడు లక్షలకు చేరుకున్నాయని చెప్పాడు.అతని ప్రస్తుత ఆదాయం రూ 2 కోట్లు.
రామ్ శరణ్ (Ram Saran Verma) వర్మ భారతదేశం యొక్క అత్యంత సంపన్న రైతు. అయన వివిధ భారతీయ వ్యవసాయ అవార్డులను కూడా అందుకున్నారు. అతని వ్యవసాయ పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది 2019లో అతను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.
రాజీవ్ బిట్టు (Rajiv Bittu) వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. అతను రాంచీకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుచు గ్రామంలో ఆస్తిని లీజుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అయితే మొదట్లో రాజీవ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. భూమికి అద్దె చెల్లించే స్థోమత కూడా లేకపోవడంతో ఫలితంగా అతను పండించిన కూరగాయలలో మూడవ వంతు యజమానికి అందించేవాడు తన పొలంలో ఉత్పాదకతను పెంచడానికి, అతను బిందు సేద్యం మరియు మల్చింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను అనుసరించాడు. రాజీవ్ 2014 మధ్యలో పుచ్చకాయ మరియు సీతాఫలం సాగు చేశాడు. అయితే అందులో రాజీవ్ నష్టపోయాడట. తర్వాత 32 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని బెండకాయ, దోసకాయ, పుచ్చకాయ, ఇతర రకాల పంటలు పండిస్తున్నాడు. పొలంలో ఉత్పాదకతను పెంచడానికి డ్రిప్ ఇరిగేషన్ మరియు మల్చింగ్ వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 15 లక్షల నుండి 16 లక్షల వరకు లాభాన్ని పొందుతాడు.