Rice Age Testing Method: పంట విషయంలో దళారుల ఆగడాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. అమాయక రైతుల వద్ద తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి అధిక ధరకు మిల్లర్లకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. కొందరు దళారులు గ్రామాల వారీగా రేషన్ బియ్యం సేకరించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. వారు కాస్త నాణ్యంగా ఉన్న బియ్యాన్ని ఎఫ్సీఐకి చేరుస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం రీసైకిల్ దందాకు చెక్ పెట్టింది. దీని కోసం రంగు, కాల పరీక్ష నిర్వహించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వినియోగిస్తోంది.
దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం రైస్ ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దోపిడీని అరికట్టేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. అయితే ఈ విధానం ద్వారా బియ్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుండటంతో బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట పడుతుంది. కాగా.. ఈ విధానాన్ని ప్రయోగాత్మక ఫలితాల అనంతరం దేశమంతా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: అకాల వర్షాలతో రైతుల ఆందోళన.!
రైస్ ఏజ్ టెస్ట్ (Rice Age Test) ఎలా చేస్తారు అంటే… మిథైల్ రెడ్, బ్రోయోథైమోల్ బ్లూ, ఇథైల్ ఆల్కహాల్ ద్రవణాలలో నీటిని కలపాలి. అందులో నుంచి టెస్ట్‌ట్యూబ్‌లో 10 ఎంఎల్ మిశ్రమాన్ని తీసుకుని ఐదు గ్రాముల నమూనా బియ్యాన్ని కలపాలి. నిముషం తర్వాత బియ్యం రంగు మారుతుంది. ఆకుపచ్చగా మారితే తాజా మిల్లింగ్ బియ్యం అంటే నెలలోపు మిల్లింగ్ చేసినవిగా పరిగణిస్తారు. లేత ఆకుపచ్చ రంగులో మారితే ఒకటి నుంచి రెండు నెలలు, పసుపు రంగులో మారితే మూడు నెలలు, నారింజ రంగులోకి మారితే నాలుగు నుంచి ఐదు నెలల క్రితం మిల్లింగ్ చేసినవిగా నిర్ధారిస్తారు.
Also Read: ఏపీ సీడ్స్ కి జాతీయ స్థాయి స్కాచ్ అవార్డ్