జాతీయంవార్తలు

Pusa Krishi Vigyan Mela: మార్చి 9 నుండి నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ ఫెయిర్ 2022

0
Pusa Krishi Vigyan Mela

Pusa Krishi Vigyan Mela: నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ ఫెయిర్ 2022 మార్చి 9 నుండి మార్చి 11 వరకు జరగనుంది. ఢిల్లీలోని IARI పూసా మైదానంలో ఈ ఫెయిర్ జరగనుంది. కాగా ఐసీఏఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Pusa Krishi Vigyan Mela

Pusa Krishi Vigyan Mela

ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు, ప్రైవేట్ సంస్థలు, మరియు రైతులు ఇందులో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న నూతన సాంకేతికతలపై రైతులకు అవగాహన కల్పించడం ఈ మేళా ముఖ్య ఉద్దేశం. (National Agricultural Science Fair)

Farmers

Farmers

సుస్థిర వ్యవసాయం యొక్క పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించడం మరియు ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి వారు దానిని ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఈ కార్యక్రమంలో చర్చిస్తారు. ఆగ్రోకెమికల్స్‌ వినియోగం, వారికి ప్రయోజనం చేకూర్చే వివిధ పథకాలపై కూడా అవగాహన కల్పించనుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరగనున్న ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు ఇందులో పాల్గొననున్నారు. ఇందులో రబీ పంటల ఉత్పత్తిలో ఉపయోగించే సాంకేతికతలు, కూరగాయలు మరియు పూల సాగులో ఉపయోగించే సాంకేతికతలను ప్రత్యక్షంగా ప్రదర్శింస్తారు.

Also Read: లాక్డౌన్ మామిడి దేశానికి ప్రగతి

Crop

Crop

ICAR మరియు ఇతర ప్రైవేట్ సంస్థలచే వివిధ వ్యవసాయ పరికరాలు, వినూత్న రైతు ఉత్పత్తులు మరియు యంత్రాల ప్రదర్శనలు మరియు విక్రయాలు ఉంటాయి. విత్తనాలు, నారు, జ్యూస్‌లు, పచ్చళ్లు, పండ్లు మొదలైన సహజసిద్ధమైన ఉత్పత్తుల విక్రయాలు కూడా ఇందులో ఉంటాయి.

రైతులకు ఉచిత ఖర్చుతో కూడిన ఏర్పాట్లు, వ్యవసాయ సాహిత్యాల పంపిణీ, నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునే నీటిపారుదల సాంకేతికత ప్రదర్శన, బయో-ఎరువులు మరియు వ్యవసాయ రసాయనాల విక్రయాలు, ఉచిత నీరు మరియు నేల పరీక్షలు వంటివి మేళాలోని ఇతర ఆకర్షణలుగా ఉండనున్నాయి.

Also Read:  మహారాష్ట్రలో GI ట్యాగ్ పేరుతో నకిలీ అల్ఫోన్సో మామిడి

Leave Your Comments

Dry Grass: పాడిలో నాణ్యమైన ఎండుగడ్డి ఎంపిక విధానం, లాభాలు

Previous article

Brinjal Cultivation: వంగ సాగు సస్య రక్షణ

Next article

You may also like