వార్తలు

మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు

0
Prices Of Edible Oil
Oil Prices

Prices Of Edible Oil Fall ఏడాది కాలంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుడిపై పెరిగిన ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్, ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అయితే ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిత్యావసర సరుకులపై సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. తాజాగా ఆయిల్ ధరలపై సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్పందించారు.

Atul Chaturvedi

Edible Oil Prices ప్రధానంగా దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల గత నెలలో ఎడిబుల్ ఆయిల్ ధరలు కిలోకు రూ. 8-10 తగ్గాయి మరియు దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో రాబోయే నెలల్లో రూ. 3-4/కిలో తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది మాట్లాడుతూ… పామ్, సోయా & పొద్దుతిరుగుడు నూనెల ధరల కారణంగా గత కొన్ని నెలలుగా భారతీయ ఎడిబుల్ ఆయిల్ వినియోగదారుడిపై ఆర్థిక ప్రభావం చూపిందని చెప్పారు. అయితే దీపావళికి ముందే సీఈఏ తన సభ్యులకు ధరలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించినట్లు అతుల్ చతుర్వేది గుర్తు చేశారు. ఈ మేరకు ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలను కూడా కేంద్రం తగ్గించిందని అయన అన్నారు. ఈ చర్యల వల్ల గత 30 రోజుల్లో కిలోకు దాదాపు రూ.8-10 వరకు చమురు ధరలు తగ్గడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. Atul Chaturvedi

Atul Chaturvedi

కాగా.. దేశంలో సోయాబీన్ పంట 120 లక్షల టన్నులు, వేరుశనగ పంట 80 లక్షల టన్నులకు మించి ఉండడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు అదుపులోనే ఉంటాయని చతుర్వేది చెప్పారు. మరో విశేషం ఏంటంటే.. రైతుల అధికంగా ఆవాల ఉత్పత్తి చేస్తున్నారని, దాదాపు 77.62 లక్షల హెక్టార్లలో అత్యధిక ఆవాలు సాగు చేశారని ఈ మేరకు అతుల్ చతుర్వేది తెలియజేశారు. గతంతో పోలిస్తే.. దాదాపుగా 30 శాతం వృద్ధి చెందినట్లు అయన తెలిపారు. రాబోయే సంవత్సరంలో దేశీయంగా ఆవనూనె లభ్యతను 8 నుండి 10 లక్షల టన్నులకు పెంచే అవకాశం ఉందన్నారాయన. Solvent Extractors Association

అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉందని, దాదాపు 22-22.5 మిలియన్ టన్నుల మొత్తం వినియోగంలో దాదాపు 65% భారతదేశంల దిగుమతి అవుతుందని చెప్పారు. అంటే డిమాండ్ మరియు దేశీయ సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి భారతదేశం దాదాపు 13-15 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా దిగుమతి దాదాపు 13 మిలియన్ టన్నులకు తగ్గిందని చెప్పారు చతుర్వేది. Edible Oil Price

Leave Your Comments

రైతులకి గుడ్ న్యూస్…రేపే ఖాతాల్లోకి నగదు

Previous article

చిరు ధాన్యాలతో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్…

Next article

You may also like