పశుపోషణవార్తలు

వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత తయారీ

0
cattle food

cattle foodఎల్లప్పుడు మన పంటలలో గాని, ఇంటిలోగాని వ్యర్థ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. మనకు దొరికే వీటితో మంచి మేతను పశువులకు అందించవచ్చును. దీని వలన రైతుకు ఆర్ధిక నష్టాన్ని కొంతమేరకు తగ్గించి పశువులకు పోషకాలు కలిగిన ఆహారం అందించవచ్చు.

రైతులకు అందుబాటులో దొరకు వ్యర్ధములు: పనికి రాని రకం ఎండు ఆకు, చెరకు పిప్పి పనికి రాని అరటి మానులు మరియు ఆకులు, పనికి రాని కూరగాయలు, రాలిన చెట్ల ఆకులు, అడవిలోని ఎండు గడ్డి, చిరు ధాన్యాల గడ్డి , కంకులు, పప్పు ధాన్యాల కట్టే, పొట్టు, చెట్ల పచ్చి ఆకులు, మామిడి జీడి గింజలు, చింత గింజలు.
ఎలా పైన ఉదహరించిన వాటి తో గాని ఇతరముల తో గాని పశువులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన హానికరం కాని ఆరోగ్య విలువలు ఉత్పాదక శక్తిని కోల్పోనట్టి విదంగా తయారు చేసి మితముగా అందించి కరువు క్లిష్టపరిస్థితుల నుండి మన పశు జీవాలను కాపాడు కోవచ్చును.

1. మామిడి ముట్టేల నుండి జీడిని తీసి ఎండ బెట్టి గాని పొడి చేసి గాని, అటులనే గాని పశువులకు ఆహారంగా వాడుకొనవచ్చును.
2. పశువుల పచ్చని వ్యర్థ ఆకులతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన మేత (శాతం):
* పచ్చి అరటి బోదె – 50, పచ్చి గడ్డి -35, పచ్చి కూరగాయలు, పండ్లు, పనికిరాని పందిరి కాయలు 10, ఉప్పు, బెల్లం -3, అరటి బోదె, గడ్డి, కూరగాయలు ముక్కలుగా తరగాలి. బెల్లము, ఉప్పు కలిపి ప్లాస్టిక్ డ్రమ్ము లో గాలి చొరబడకుండా నీడన ఉంచాలి. ఇది చాల బలవర్ధకమైన ఆహారము . దీనిని 7-10 రోజుల లోపు వాడుకొనవచ్చును . పాల వృద్ది, రుచి, వెన్న శాతము బాగా పెరుగుతుంది. మేలు జాతి ఎద్దులకు మంచి ఆహారము .

3. గింజల పొట్టులతో మిశ్రమము (శాతము):
* మొక్క జొన్న 10, పప్పు దినుసులు పొట్టు (ఉలవలు, అలసందలు, ఆనప) 10, వరి గడ్డి లేక చెరకు ఆకు లేక చెరకు పిప్పి 10, ఉప్పు 2, గింజలు 10 (రాగి, జొన్న, సజ్జ), తాడు 38, గానుగ పిండి 10, పై పొడిని కొట్టించుకుని పశువులకు వాడుకొనవచ్చును.

4. మరొక మిశ్రమము శాతము:
* మొక్కజొన్న లేక కోయ్యగానును (కర్ర పెండ్యులము) లేక బీరు పొట్టు 65 %, పొట్టు (అలసంద, శనగ, పెసర, మినుము, అనప పొట్టు) 15. తౌడు 10, ఉప్పు 3, ఎముకల పొడి 2, బెల్లపు మద్ది 5. పై అన్ని కలిపి డ్రమ్ము లో ఉంచుకుని 10 రోజుల లోపు వాడుకోవాలి వేరుశనగ, ప్రత్తి చెక్కలు కూడా కలుపు కుంటే పాల మరియు వెన్న శాతము ను ఇంకా వృద్ధి చేసుకొనవచ్చు.
5. చింత గింజల కాల్చి తరువాత పొడిగా చేసుకుని 10 లీటర్ల నీటిలో 250 గ్రాముల నుండి 300 గ్రాములు కలిపి జావగా చేసుకుని ప్రతి రోజు 2 పూటలా పశువులకు నీటి ద్వారా కలిపి వాడిన ఆరోగ్యంగా ఉందును మరియు విష తుల్య పదార్థాలు ఉన్న తొలగిపోవును.

6. ఎండాకాలములో కరవు సమయము లో:
* పచ్చి మేత దొరకడము కష్టము కాబట్టి అట్టి పరిస్తితులలో సుబబుల్, అవిస వేప, గానుగ, గైరిశీడీయా రావి, మోదుగ, మర్రి ఆకుల తో పశువులను మేపుకొనవచ్చును. మొక్కజొన్న, జొన్నలు, అలసందలు మరియు ఎండుగడ్డిని వాడవచ్చును.

7. ఎండు ఆకులతో మేత తయారీ (శాతం):
ఎండు ఆకులు 50 (సుబబుల్, రావి, గ్లైరెసిడియా, ఏవైనా పశువులు తినే ఆకులు). బెల్లపు ముడ్డి 35, ఎముకల పొడి 4, యూరియ 2, ఉప్పు 2 (అయోడిన్), నీరు 7.
పై వాటిని కలుపుకుని ఆకులపై చల్లుకుని భద్రపరచుకుని పశువులకు వాడుకో వచ్చును.

8. పశువుల పానకము ద్రావణ దాణ తయారీ (శాతం):
* బెల్లపు ముడ్డి 92, యూరియ 2, ఎముకల పొడి 2, ఉప్పు 2, నీరు 2. పైవన్నీ కలుపుకుని భద్రపరచుకుని ప్రతి రోజు 1 నుంచి 3 లీటర్ ల వరకు త్రాగించావచ్చును. ఈ మిశ్రమము ముఖ్యముగా పెరిగే పశువులకు, సేద్యానికి పోయే పశువులకు మరియు గర్భము ఉండే పశువులకు ఇచ్చిన మంచి ఫలితాలు ఉండును.

9. ఎండు చెరకు ఆకులతో పశు ఆహారము:
* చెరకు ఆకు 100 కిలో గ్రాములు బాగా త్రోక్కించాలి .చెరకు మడ్డి లేక పురు బెల్లము, యూరియ , ఉప్పు, ఎముకల పొడి 30 లీటర్ల నీటిలో కలిపి ఆకు పై చల్లి, మొత్తము వాటగా వేసుకుని 7 – 10 రోజుల తరువాత మేపుకొనవచ్చును.

10. చెరకు పిప్పి (బగాసే) తో పశు ఆహారము:
* చెరకు పిప్పి 100 కి. గ్రా, బెల్లపు మద్ది లేక చెరకు మద్ది 10 కి. గ్రా., యూరియ 2 కి.గ్రా.. ఉప్పు 2 కి.గ్రా., ఎముకల పొడి 2 కి.గ్రా., నీరు 10-20 లీటర్లు పై విధంగా కలుపుకుని చెరకు పిప్పి పై చల్లి సంచులతో గాని, ఇంటిలోపల గాని భద్రపరచుకుని 2-5 కిలోలను పశువులకు ఇవ్వవచ్చును.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప.

Leave Your Comments

వరిసాగులో వివిధ పద్ధతులు – రైతులు ఆచరించాల్సిన అంశాలు

Previous article

తొలకరి నువ్వుల సాగు – యాజమాన్యము

Next article

You may also like