కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో రైతుల కోసం కూడా మోదీ సర్కారు ప్రత్యేక పథకాలు అందిస్తోంది. వీటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తున్నాయి. అయితే ఈ రూ. 6 వేలు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో చేరుతున్నాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు విడతల డబ్బులను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు రానున్నాయి. మోదీ సర్కారు ఈ నెల చివరి కల్లా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయనుందని తెలుస్తోంది. పలు నివేదికలు ఇదే విషయాన్నీ వెల్లడిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు మీకు వస్తాయా.. రావా… అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. బెనిఫీషియరీ లిస్ట్ లో మీ పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి.