వార్తలు

తీగ జాతి కూరగాయల పంటలలో సస్యరక్షణ

0

పందిరి (తీగ) కూరగాయలు (కాకర, బీర, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి) పంటలలో సస్యక్షణ:

  • ఎండా కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. వరి పంటతో పంటమార్పిడి చేయాలి.
  • మిథైల్ యూజినాల్ + వెనిగర్ + పంచదార ద్రావణం 10 మి.లీ. చొప్పున కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి. లేదా 100 మి.లీ. మలాథియాన్ + 100 గ్రా. బెల్లం 10 లీ. నీటిలో కలిపి పాదుల్లొ అక్కడక్కడ పొలంలో ఉంచాలి.
  • కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 గ్రా. విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రా. చొప్పున వాడి విత్తనశుద్ధి చేయాలి.
  • అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశలో నుండి పూత వచ్చే వరుకు 5% వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
  • పెంకు పురుగల నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
  • బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ లేదా కార్బెండిజమ్ లేదా హెక్సాకొనజోల్ 1 మి.లీ. చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
  • నులిపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రా. ఒక కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుధ్ధి చేయాలి.
  • తీగజాతి పంటలపై గంధకం సంభదిత పురుగు/తెగులు మందులు వాడరాదు. దీనవలన ఆకులు మాడిపోతాయి
Leave Your Comments

మల్బరీ పంట సాగులో మెళుకువలు

Previous article

కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త..

Next article

You may also like