PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2022 సంవత్సరంలో పలు పంటల్లో 15 నూతన వంగడాలు విడుదల చేయడమయినది. అందులో ఎనిమిది వంగడాలు జాతీయ స్థాయిలో మరియు ఏడు వంగడాలు రాష్ట్ర స్థాయిలో విడుదల కాబడ్డాయి.
జూన్ 6, 2022 తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల మరియు నోటిఫికేషన్ కమిటి సమావేశం సిఫారసు ప్రకారం, వరిలో ఐదు (5), పశుగ్రాస సజ్జలో రెండు (2) మరియు నువ్వులో ఒకటి(1) రకాల విడుదలకు ఆమోదం తెలిపి గెజిట్ లో ప్రచురించబడింది. ఈ రకాలు దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాగుకు అనుకూలంగా ఉంటాయి.
అదే విధంగా రాష్ట్రస్థాయిలో నాల్గవ నూతన వంగడాల విడుదలకై ఏర్పాటైన రాష్ట్ర ఉప కమిటి సమావేశం సెప్టెంబర్ 3, 2022, తేదిన అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమీషనర్ మరియు సెక్రటరి, వ్యవసాయ శాఖ శ్రీ యం. రఘునందన్ రావు గారి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఐదు వరి రకాలు, మినుము మరియు నువ్వు పంటలలో ఒక్కో రకం చొప్పున మొత్తం ఏడు (7) నూతన రకాలను పరిశీలించి విడుదలకు సిఫారసు చేయబడ్డాయి. ఈ ఏడు రకాలు కూడా అక్టోబర్ 26, 2022 న జరిగిన జాతీయ స్థాయి వంగడాల విడుదల మరియు నోటిఫికేషన్ కమిటి సమావేశంలో చర్చించి బాగున్నట్లు గుర్తించి నోటిఫికేషనుకు సిఫారసు చేయబడ్డాయి.
వరి పంటలో నూతనంగా విడుదలైన రకాలలో నూక శాతం తక్కువగా చీడపీడలను తట్టుకునే గుణాలు, అలాగే గింజ మిక్కిలి సన్నంగా ఉంది అన్నం నాణ్యత చాలా బాగా ఉండే గుణాలు కలిగి ఉన్నాయి. అంతే కాకుండా చిట్టి ముత్యాలు అనే లోకల్ రకానికి ప్రత్యామ్నాయంగా సువాసన గల పొట్టి రకమును కూడా విడుదల చేయడమయినది. వీటితో పాటు తెల్లగింజ జడకాత నువ్వు రకము మరియు చీడపీడలను తట్టుకునే మినుము రకాలు కూడా ఉన్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2014 లో ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు వివిధ పంటలలో 2022 సంవత్సరంలో విడుదలయిన 15 రకాలతో కలిపి 61 నూతన రకాలను అందిచడం ద్వార పలు పంటలలో రాష్ట్ర రైతులే కాకుండా ఇతర రాష్ట్ర రైతుల నికర ఆదాయం పెంచడంలో విశేషంగా కృషి చేస్తుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం) మరియు ప్రస్తుత వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ యం. రఘునందన్ రావు గారు, డా ఎస్. సుధీర్ కుమార్, రిజిస్ట్రార్ మరియు పరిశోధన సంచాలకులు డా ఆర్. జగదీశ్వర్ గారు హర్షం వ్యక్తపరిచి ఈ కాల విడుదలకు కృషి చేసిన బ్రీడర్లను మరియు ఇతర విభాగ శాస్త్రవేత్తలను అభినందించారు.
Also Read: Smart Agri Summit 2022: స్మార్ట్ అగ్రి సమ్మిట్ 2022.!
Also Watch: