రైతులువార్తలు

Pest Control In Papaya Cultivation: బొప్పాయిలో పిండినల్లి నివారించే పద్ధతులు

1
Pest Control In Papaya Cultivation
Papaya

Pest Control In Papaya Cultivation: బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య తగ్గిపోతోంది. ప్రధానంగా మొక్క నాటిన దగ్గర నుండి పంట చివరి వరకు పిండినల్లి బెడద రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడిచేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను ఏంటో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగుకు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్‌ రకాలని చెప్పవచ్చు. ప్రస్థుతం రైతులు హెక్టారుకు 50 నుండి 100 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. అయితే ఈ పంటకు చీడపీడల సమస్య ఎక్కువ వుండటం వల్ల ఇటీవలికాలంలో సాగులో విజయాల శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా రసంపీల్చు పురుగుల దాడి వల్ల వైరస్‌ తెగుళ్ల వ్యాప్తిచెందుతున్నాయి. బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి. పిండినల్లి గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Pest Control In Papaya Cultivation

Papaya

పిండినల్లి నివారణ :

1. పాదుల్లో మట్టిని చెక్కాలి. ఒక్కో పాదుకు ఫాలిడాల్‌ 100 నుండి 150 గ్రా. చొప్పున డస్టింగ్‌ చేయాలి.
2. అడుగు ఎత్తులో కాండానికి ప్లాస్టిక్‌ కవర్‌ లేదా పురుగుమందు ద్రావణం పూయాలి.
3. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్‌ 2మి. లీ. లేదా బూఫ్రోఫెజిన్‌ 2 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.25 మి.లీ లేదా థయోమిథాక్సామ్‌ 0.25 గ్రా. మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
4. ఉధృతి అధికంగా ఉంటే డైక్లోరావాస్‌ (నువాన్‌) మందును పిచికారి చేసుకోవాలి.
పంట అయిపోయాక ఎండిన చెట్లు. నేల రాలిన ఆకులను ఏరి తగులబెట్టడం ద్వారా పిండి నల్లిని నివారించవచ్చు. వాస్తవానికి ఈ పిండి నల్లి మనదేశానికి సంబంధించిన పురుగు కాదు. మెక్సికోకు చెందిన ఈ పురుగు, మన దేశానికి రవాణా ద్వారా వచ్చిచేరి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతులు సోదరులు ఈ పురుగు పట్ల జాగ్రత్త వహించి, తొలిదశనుండే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంటుంది.

Leave Your Comments

Farmer Success Story: గోదావరి కౌలు రైతు విజయ గాథ

Previous article

Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు !

Next article

You may also like