ఆంధ్రప్రదేశ్వార్తలు

Acharya N.G. Ranga Agricultural University: లాం ఫారం లో డిసెంబర్ నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు.!

2
Acharya N.G. Ranga Agricultural University
Acharya N.G. Ranga Agricultural University

Acharya N.G. Ranga Agricultural University: చిన్న మరియు సన్నకారు రైతులు అధికంగా ఉన్న మన దేశంలో పంటలతో అనుసందానికి అనుకూలమైన రంగాలను ప్రోత్సాహిస్తే రైతులకు బహు లాభాలు- గ్రామీణ కుటుంబ వ్యవస్థ స్వావలంభన నికర ఆదాయం,సామర్ధ్యం పెంపొందించుకోవడం, నైపుణ్యాభివృద్ధి తద్వారా రైతులు జీవన ప్రమాణాలను పెంపొందిన్చడంతో పాటు రైతులకు ముఖ్యంగా యువతకు ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆసక్తిని కలుగజేస్తాయి. రైతు సేవలో నిరంతర కృషి చేస్తున్న ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ విద్యా విస్తృత వ్యాప్తి కి గుంటూరు, లాం ఫారం లో సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది రైతులు, మహిళలు, యువత మరియు ఆసక్తి కలిగిన వారు వ్యవసాయ విద్యను పొందేలా దూర విద్య ద్వారా సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించడం జరిగింది. ఈ సర్టిఫికేట్ కోర్సుల ద్వారా రైతులకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతులు మరియు ప్రయోగాకార్యక్రమాల ద్వారా అందించి వారి నైపుణ్యతను మెరుగుపరిచి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది.

Acharya N.G. Ranga Agricultural University

Acharya N.G. Ranga Agricultural University

ఈ కోర్సులలో నమోదు అయిన వారు రానున్న కాలంలో స్వయం ఉపాది కల్గించుకోనేందుకు మంచి అవకాశం ఉంది. గత 4 సంవత్సరాలలో దూర విద్యా కేంద్రం ద్వారా వివిధ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించి సుమారు 4,000 మంది రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఉన్నత శిక్షణ అందజేసి వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 2020-21 సంవత్సరంలో కోవిడ్- 19 ప్రభావం వల్ల సామజిక దూరం పాటించాలి అని ప్రభుత్వాలు ఆదేశించడంతో సర్టిఫికేట్ కోర్సులను ఆన్లైన్ మాద్యమం లో నిర్వహించి ప్రతి కోర్సులో ఒక రోజు ప్రయోగ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
డిసెంబర్,2022 నుండి ప్రారంభం కానున్న నాలుగు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు- చిరుధాన్యాలు, వర్మికంపోస్ట్, సెరికల్చర్, బయోఫెర్టిలైజర్ 8 వారాలు (2 నెలలు) వ్యవధిలో నిర్వహించబడును.ఆసక్తి ఉన్న వారు ఒక్కొక్క కోర్సుకు రూ.1,500/- చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు 01-12-2022 లోపు నమోదు కాగలరు, నమోదు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్లైన్ సదుపాయం (కంప్యూటర్/ఆండ్రాయిడ్ సెల్ ఫోన్/ఐపాడ్) కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ కోర్సులు చేయుటకు ఆసక్తి కలవారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును. ఈ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ (www.angrau.ac.in) ను సందర్శించి తెలుసుకోవచ్చును.                                                                               ఫోన్ 30:-8008788776, 8309626619,9110562727.

Also Read: Black Berries Health Benefits: బ్లాక్ బెర్రీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? అయితే ఇది మీ కోసమే.!

Must Watch: 

Leave Your Comments

Cultivation of Maize In Paddy Fields: వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – మెళకువలు.!

Previous article

Rajendranagar Agricultural University: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక బ్రీడింగ్ పద్ధతులపై అవగాహన సమావేశం.!

Next article

You may also like