పశుపోషణవార్తలు

ఒంగోలు ఆవుకు పూర్వ వైభవం

0

పిండ మార్పిడి విధానంలో మేలుజాతి అభివృద్ధి ప్రకృతి సేద్యంతో దేశవాళి సంతతికి ఆదరణ

తెలుగు వారి పౌరషం,రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఒంగోలు ఆవులు ప్రపంచవ్యాప్తంగా పాడి ఉత్పత్తిలో డంకా బజాయిస్తున్నాయి.మన సొంత సంతతి విశిష్టతను మనం తెలుసుకునేలోపు .. ఇక్కడి మేలు జాతి అంతా విదేశాలకు తరలిపోయింది.ప్రకృతి సేద్యం పుణ్యమాని .. ఇప్పుడు ఒంగోలు ఆవులకు మంచి రోజులోచ్చాయి.అవసరం వచ్చింది కదాని కొందామంటే శ్రేష్టమైనవి దొరకడం లేదు. 9 నెలల దూడను కొనలంటేనే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు అవుతోంది.ఆవులైతే రూ.40 వేల పైమాటే.ఇక గిత్తలకు రూ.3లక్షల నుంచి రూ.50లక్షల వరకు పలుకుతోంది. సాధారణ రైతులకు వీటిని కొనడం ఆసాధ్యం కావడంతో .. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్ధానంలో దేశవాళి ఆవుల్ని పిండ మార్పిడి విధానంలో ఆభివృద్ధి చేస్తున్నారు.

టెస్ట్ ట్యూబ్ బేబి విధానంపై ఆశలు :పిండ మార్పిడి సాకేతికత ద్వారా దేశవాళి ఆవుల సంతతిని వృద్ది చేసేందుకు కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాలు జాతీయ మిషన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరులోని శ్రీ  వెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్ధానంలోని పిండోత్పత్తి జీవ సాంకేతిక ప్రయోగశాలను కేంద్ర పశుపాలన,డైయిరి,మత్య్స పాలనా విభాగం గుర్తించింది. ఇక్కడ ఒంగోలు,పుంగునూరు,గిర్ ఆవుల అభివృద్ధి పధకాన్ని చేపట్టారు.

సాధరణంగా.. ఒక ఆవు జీవితకాలంలో ఎనిమిది నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది.ఐవీఎఫ్, పిండ మార్పిడి విధానంలో ఒక మేలు జాతి ఆవు నుంచి 50 నుంచి 100 పిండాలను ఉత్పత్తి చేసి, 30 నుంచి 40 దూడలను పొందవచ్చు .

ఐవీఎఫ్ ప్రయోగాల్లో భాగంగా.. మేలుజాతి ఆవుల నుంచి అపరిపక్వ మాతృ జీవకణాల్ని సేకరించి.. ఇమ్ క్వుబేటర్ లో మేలు జాతి ఆంబోతు వీర్య కణాలతో సంపపర్కం చేస్తారు. ఆనంతరం ఫలదీకరణం చెందిన పిండాలను అద్దె గర్భం లోనికి ఎక్కించడం ద్వారా    అత్వుత్తమ జన్యు సంపద కలిగిన సంతతిని పుట్టిస్తారు.ఈ టెస్ట్ ట్యూబ్ బేబి టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు 600 వరకు ఉత్తమ జన్యు  సంప్రదాయ మున్న పిండాలను అభివృద్ధి చేసి భద్రపరిచారు. వీటిని శిక్షణ పొందిన పశు వైద్యుల ద్వారా రైతులకు చెందిన ఆవులలో గర్భంలో.. వారి ఏంటి వద్దనే ప్రవేశ పెడతారు.ఒంగోలు ఆవులు మండుటెండలను,వణికించే చలిని..అతివృష్టి,అనావ్వృష్టి,కరువు కాటకాలను తట్టుకోవడం తో పాటు అధికపాల దిగుబడిని ఇస్తాయి.గుంటూరు లాం ఫారంలోని పశుపరిశోధనా స్ధానంలో ప్రస్తుతం 30% ఆవులు .. ప్రతి ఈతలో 1500 లీటర్ల పాల దిగుబడిని ఇస్తున్నాయి. సగుటున ఈతలో 1200 లీటర్ల పాలిచ్చి నా . జీవిత కాలంలో 18000 నుంచి 24000 లిటర్ల మేరకు ఉత్పత్తి జరుగుతుంది. మున్ముందు పుట్టే వాటిలో 90% పెయ్య దూడలే ఒక్కో పిండానికి సుమారు రూ.10వేల వరకు ఖర్చవుతుంది. దేశవాళి ఆవుల సంతతి పెంపుదలలో   భాగంగా ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి  వరకు 19 ఆవులు అద్దె గర్భం దాల్చగా.. 9 దూడలు పుట్టాయి. ప్రతి నెలా సుమారు 40 నుంచి 50 పిండాలను రైతులకు పంపిణి చేస్తున్నాం. ప్రత్యేక విధానంలో ఆంబోతు వీర్యాన్ని వాడటం ద్వారా.. పుట్టేదూడల్లో 90% వరకు పెయ్య దూడలను పొందే అవకాశం త్వరలో రాబోతుంది.

 

 

 

Leave Your Comments

కొర్ర సాగు లో మెళుకువలు

Previous article

మిరపలో వైరస్ తెగుళ్ల లక్షణాలు-సమగ్ర యాజమాన్యం

Next article

You may also like