Oil Palm Cultivation: హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో జరిగిన భారత వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూనెగింజల సాగు, ఉత్పత్తి మరియు పరిశ్రమల అభివృద్ధిపై నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ముఖ్య అతిథి మంత్రి కేటీఆర్ గారు, IVPA అధ్యక్షులు సుధాకర్ దేశాయ్ గారు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. దీనిలో గరిష్టభాగం ఇండియా మరియు చైనాలది. ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనెగింజలు అవసరం. భారతదేశంలో వీటి వినియోగం ఏటా 20 నుండి 22 మిలియన్ టన్నులు. కానీ ఇక్కడ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిఉన్నా అవసరానికి సరిపడా కనీసం 50 శాతం ఉత్పత్తి చేయలేకపోవడం దురదృష్టకరం. ఏటా రూ.90 వేల నుండి లక్ష కోట్లు వెచ్చించి కావాల్సిన నూనెగింజలు దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే వాటిలో దాదాపు 65 శాతం పామాయిల్ ఉండడం గమనార్హం. మన దేశంలో ప్రతి ఒక్కరూ సాలీనా సగటున 19 కిలోల వంటనూనెలు వినియోగిస్తున్నారు. అయిల్ పామ్ మాత్రమే కాకుండా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు పండించడానికి అత్యంత అనువైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించారు.
Also Read: Acharya N.G. Ranga Agricultural University: డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పర సహాయ సహాకారాలు.!
రాష్ట్రంలో గత ఏడాది వరకు 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. గతంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా వాతావరణ పరిస్థితులు అనుకూలించవని అన్నారు. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగిందని, దీనిపై నిపుణుల కమిటీ వేసి విచారణ చేయాలని కోరగా .. ఆ కమిటీ విచారణ చేసి 25 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం అని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 25 జిల్లాలను 11 కంపెనీలకు కేటాయించి ఆయిల్ పామ్ నర్సరీలు, ఇతర సౌకర్యాలు, రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ పామ్ సాగును ముందుకు తీసుకెళ్తున్నాం.
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉన్నదని కేంద్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానికి అనుగుణంగా తెలంగాణలో రాబోయే మార్చి నాటికి లక్ష 78 ఎకరాలలో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం .. 40 వేల ఎకరాలలో ఇప్పటికే మొక్కలు నాటడం పూర్తయింది. అన్ని ప్రభుత్వాలు నూనెగింజల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.
ప్రపంచం వేగంగా ముందుకు సాగుతున్నది .. అంతే వేగంగా పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ పనిచేస్తూ ముందుకు సాగుతూ దేశానికి వన్నె తెస్తున్నారు. ఆచరణాత్మక, వ్యూహాత్మక నాయకుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ నేతలలో అందరిలో దార్శనికత గల నేత. తెలంగాణలో ఎనిమిదేళ్ల కేసీఆర్ గారి పాలన దేశానికి ఆదర్శం. సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి , నాణ్యమైన దిగుబడులు, ప్రతి ఎకరానికి సాగునీరు మూలంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రాష్ట్ర రైతులు నూనెగింజల సాగు విస్తీర్ణం పెంచి దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Also Read: Medical Education: ప్రజల వద్దకే వైద్యం అందుబాటులో వైద్యవిద్య.!
Also Watch: